FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో నేడు ఇంగ్లండ్- ఇరాన్ మ్యాచ్- విశేషాలివే!
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో నేడు గ్రూప్- బీ మ్యాచులో ఇంగ్లండ్- ఇరాన్ తలపడనున్నాయి. ఖలీఫా ఇంటర్నేషనల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో నేడు గ్రూప్- బీ మ్యాచులో ఇంగ్లండ్- ఇరాన్ తలపడనున్నాయి. ఖలీఫా ఇంటర్నేషనల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాప్ 16 లో చేరే జట్లలో ఇంగ్లండ్ స్పష్టమైన ఫేవరెట్ గా ఉంది. నాకౌట్ రౌండులకు ముందు సాధించిన మూడు వరుస విజయాలు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ కంటే ఇంగ్లండ్ వేల్స్ జట్టు మెరుగైన రికార్డు కలిగి ఉంది. వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రపంచకప్ కు అర్హత సాధించారు. అలాగే ఇంగ్లండ్ జట్టు యూరోపియన్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ఖతార్ కు వచ్చింది.
మరోవైపు ఫిఫా పురుషుల ర్యాంకింగ్స్‌లో ఇరాన్ 20వ స్థానంలో కొనసాగుతోంది. గత రెండు సార్లు గ్రూప్ దశలను దాటడంలో వారు విఫలమయ్యారు. అయితే ఇప్పుడు టాప్ 16లో ఉండేందుకు ఆ జట్టు పట్టుదలగా ఉంది. అందుకే గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది.
ఇంగ్లండ్- ఇరాన్ పోటీ గురించి ఆసక్తికర విషయాలు
1. తొలిసారిగా ఇంగ్లండ్, ఇరాన్ జట్లు తలపడనున్నాయి. ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ ను ఇరాన్ ఎప్పుడూ ఓడించలేదు.
2. ఫిఫా ప్రపంచకప్‌కు ఇంగ్లిష్ జట్టు వరుసగా 16 వ సారి అర్హత సాధించింది.
3. చివరి రెండు ప్రధాన టోర్నమెంట్లలో (ఫిఫా వరల్డ్ కప్ + యూరో) సెమీ-ఫైనల్‌కు చేరుకున్న ఏకైక యూరోపియన్ జట్టు ఇంగ్లాండ్.
4. ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ మొదటి రౌండ్‌ను ఎప్పుడూ దాటలేదు. వారు తమ 15 మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలుచుకున్నారు.
5. ఆరోసారి ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ కు అర్హత సాధించింది. అలానే వరుసగా మూడో సారి ప్రపంచకప్ లో తలపడుతోంది.
My England XI Vs Iran
— Hurri Kane | World Cup 2022 (@Hurri_Kane21) November 20, 2022
Predictions: 3-1 #ENG #FIFAWorldCup pic.twitter.com/rbwIxKAf1T
ఈక్వెడార్ విజయం
ఫిఫా వరల్డ్ కప్‌లో తన ప్రస్థానాన్ని ఈక్వెడార్ విజయంతో ప్రారంభించింది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఖతార్‌పై 2-0తో ఘన విజయం సాధించింది. ఈ రెండు గోల్స్‌ను ఎన్నెర్ వాలెన్షియా సాధించాడు. అసలు ఆట మొదటి అర్థభాగంలోనే రెండు గోల్స్ కొట్టిన ఈక్వెడార్ గేమ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది.
12వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మార్చిన వాలెన్షియా, 31వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మార్చి రెండో గోల్‌ను కూడా అందించాడు. దీంతో ఈక్వెడార్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఖతార్ గోల్ కొట్టడానికి ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఈక్వెడార్ 44వ స్థానంలో ఉండగా, ఆతిథ్య ఖతార్ 50వ స్థానంలో ఉంది. ఈక్వెడార్ తరఫున ఫిఫా వరల్డ్ కప్‌లో గత నాలుగు గోల్స్ కొట్టింది ఎన్నెర్ వాలెన్షియానే కావడం విశేషం.