By: ABP Desam | Updated at : 03 Dec 2022 11:33 AM (IST)
Edited By: nagavarapu
పోర్చుగల్ వర్సెస్ కొరియా
FIFA WC 2022 Qatar: ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు ఆసక్తిగాా మారుతున్నాయి. గ్రూప్-హెచ్‌లో రెండు విజయాలతో పోర్చుగల్ ముందే రౌండ్ ఆఫ్ 16 బెర్తును ఖాయం చేసుకుంది. మరో బెర్తు కోసం ఉరుగ్వే, దక్షిణ కొరియా, ఘనా పోటీలో నిలిచాయి. అయితే బలమైన పోర్చుగల్ ను ఓడించిన కొరియా నాకౌట్ చేరుకుంది. మరోవైపు ఘనాపై ఘన విజయం సాధించినా ఉరుగ్వే ముందంజ వేయలేకపోయింది.
కొరియా నిలిచింది
గ్రూప్ హెచ్ మ్యాచులో బలమైన పోర్చుగల్‌కు షాకిచ్చింది కొరియా. ఫిఫా ప్రపంచకప్ కొరియా జట్టు ప్రిక్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. నాకౌట్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆ జట్టు 2-1తేడాతో పోర్చుగల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బంతిపై నియంత్రణలో పోర్చుగల్ (62 శాతం)దే పైచేయి కానీ.. కీలక సమయాల్లో స్కోరు చేసిన కొరియాను విజయం వరించింది. అయిదో నిమిషంలో రికార్డో కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన పోర్చుగల్ ఆ తర్వాత కూడా పదే పదే కొరియా డిఫెన్స్‌ను పరీక్షించింది. కానీ కొరియా అదను చూసి దెబ్బ కొట్టింది. ఒకవైపు రక్షణ శ్రేణిని పటిష్టం చేసుకుని మరోవైపు దాడులు చేసిన కొరియా 27వ నిమిషంలో ఫలితం సాధించింది. కార్నర్ నుంచి బంతిని దొరకబుచ్చుకున్న యంగ్‌వాన్ మెరుపు వేగంతో నెట్‌లోకి పంపేశాడు.
Pure joy.#FIFAWorldCup | #KOR
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022
పోర్చుగల్ ప్రయత్నాలు విఫలం
ఆ తర్వాత పోర్చుగల్ గోల్ కోసం గట్టి ప్రయత్నాలే చేసింది. కొరియా కీపర్ అడ్డుగోడగా నిలవడంతో ఆ జట్టు ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసి ఆట ఇంజురీ టైమ్‌కు వెళ్లడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నట్లే కనిపించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఒత్తిడి పెరిగిపోతుండగా కొరియా అద్భుతమే చేసింది. హి చాన్ (91వ ని) ఓ సూపర్ గోల్ చేసి కొరియా నాకౌట్ ఆశలకు ప్రాణం పోశాడు. పోర్చుగల్ గోల్ బాక్స్ సమీపంలో పాస్ అందుకున్న చాన్ పొరపాటుకు తావివ్వకుండా గోల్ కొట్టేశాడు. 2-1 ఆధిక్యాన్ని ఆఖరిదాకా కాపాడుకున్న కొరియా విజయం సాధించింది.
A wild and memorable ending to the Group Stage!
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022
See matchday thirteen in 60 seconds ⏲️#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/p3bYGpLa0U
What a way to close out the Group Stage 💥
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022
These final games had us all 🤯
#FIFAWorldCup #Qatar2022
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
FIFA WC 2022: అర్జెంటీనా ప్రపంచకప్ సంబరం- రోడ్లన్నీ 'జన'మయం
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్