By: ABP Desam | Updated at : 30 Nov 2022 09:42 AM (IST)
Edited By: nagavarapu
సెనెగల్ ఫుట్ బాల్ జట్టు (source: FIFA twitter)
FIFA WC 2022 Qatar: సెనెగల్ అదరగొట్టింది. ఈక్వెడార్ పై అద్భుత విజయం సాధించి 20 ఏళ్ల తర్వాత నాకౌట్ కు అర్హత సాధించింది. రెండో విజయంతో గ్రూప్- ఏ నుంచి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. అదే గ్రూపు నుంచి ఖతార్ ను ఓడించిన నెదర్లాండ్స్ అగ్రస్థానంతో నాకౌట్ చేరుకుంది. ఖతార్, ఈక్వెడార్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సెనెగల్ జట్టు 2-1తో ఈక్వెడార్‌పై విజయం సాధించింది. ఇస్మైలా సార్ (44వ), కౌలిబలి (70వ) సెనెగల్‌కు గోల్స్ అందించారు. ఈక్వెడార్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కైౖసెడో (67వ) సాధించాడు. 2002 తర్వాత నాకౌట్ దశకు చేరడం సెనెగల్‌కు ఇదే తొలిసారి.
సెనెగల్ దూకుడు
మ్యాచ్‌లో బంతి ఎక్కువగా ఈక్వెడార్ నియంత్రణలోనే ఉంది. అయితే మొదటి నుంచి దూకుడుగా సెనెగల్ జట్టు గోల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. 12వ నిమిషంలో ఈక్వెడార్‌ను ఒత్తిడికి గురి చేస్తూ బాక్స్‌లోకి వెళ్లిన ఎండియే నెట్లో ఓ కార్నర్‌కు కొట్టడానికి ప్రయత్నించాడు. అది దూరంగా వెళ్లింది. తొలి అర్ధభాగం ఆఖర్లో ఆ జట్టుకు సెనెగల్ షాకిచ్చింది. ఈక్వెడార్ బాక్స్‌లోకి దూసుకెళ్లిన సార్‌ను హిన్‌కాపీ పడేయడంతో రిఫరీ సెనెగల్‌కు పెనాల్టీ ఇచ్చాడు. ఈక్వెడార్ గోల్‌కీపర్‌ను సార్ అలవోకగా బోల్తా కొట్టించాడు. దీంతో సెనెగల్ కు ఒక గోల్ దక్కింది.
Sliding into the Round of 16? pic.twitter.com/OySr65Ekhc
— FIFA World Cup (@FIFAWorldCup) November 29, 2022
0-1తో వెనుకబడ్డ ఈక్వెడార్ ద్వితీయార్ధాన్ని దూకుడుగా మొదలెట్టింది. 58వ నిమిషంలో గోల్ చేసేందుకు ఆ జట్టుకు మంచి అవకాశం లభించింది. ఎడమ నుంచి ఎస్తుపినన్ పెనాల్టీ స్పాట్ దగ్గరికి గొప్ప క్రాస్ ఇచ్చాడు. కానీ ఎస్ట్రడా తలతో గోల్ కొట్టడానికి ప్రయత్నించినా.. సఫలం కాలేకపోయాడు. ఈక్వెడార్ ప్రయత్నాలు ఎట్టకేలకు 67వ నిమిషంలో ఫలించాయి. కైసెడో గోల్‌తో ఆ జట్టు స్కోరు సమం చేసింది. కానీ ఈక్వెడార్ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మూడు నిమిషాల తర్వాత కౌలిబలి గోల్‌తో సెనెగల్ తిరిగి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓ ఫ్రీకిక్‌ను ఇద్రిసా బాక్స్‌లోకి కొట్టగా.. అది ఈక్వెడార్ ఆటగాణ్ని తాకుతూ నేరుగా కౌలిబలి దగ్గరకు వెళ్లింది. అతడు తేలికగా గోల్ కొట్టేశాడు. ఈక్వెడార్ స్కోరు సమం చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Through to the knockout stages 🇸🇳✅
— FIFA World Cup (@FIFAWorldCup) November 29, 2022
Watch the best bits from Senegal's win over Ecuador on FIFA+ #FIFAWorldCup | #Qatar2022
Iconic. pic.twitter.com/0SiVOCGnf7
— FIFA World Cup (@FIFAWorldCup) November 29, 2022
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
FIFA WC 2022: అర్జెంటీనా ప్రపంచకప్ సంబరం- రోడ్లన్నీ 'జన'మయం
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు