News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CSK vs KKR, Match Preview: కుర్రాళ్ల దూకుడు మంత్రం.. ధోనీ సేనపై ఏంటి కోల్‌కతా తంత్రం!

ఐపీఎల్‌ రెండో అంచెలో దూకుడు మీదున్న రెండు జట్లు నేడు తలపడుతున్నాయి. రెండూ కుర్రాళ్లనే నమ్ముకున్నాయి. రెండూ దూకుడు మంత్రమే పఠిస్తున్నాయి. అవే చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.

FOLLOW US: 
Share:

ఐపీఎల్‌ రెండో అంచెలో దూకుడు మీదున్న రెండు జట్లు నేడు తలపడుతున్నాయి. రెండూ కుర్రాళ్లనే నమ్ముకున్నాయి. రెండూ దూకుడు మంత్రమే పఠిస్తున్నాయి. అవే చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. ఈ పోరులో గెలిస్తే ధోనీసేన ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుంది. కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు పోతుంది. మరి ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం!

Also Read: పంజాబ్‌తో రైజర్స్ పోటీ.. ఓడితే అస్సామే!

ఆధిపత్యం ధోనీసేనదే
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో కోల్‌కతాపై చెన్నైదే పైచేయి. మొత్తంగా 23 సార్లు తలపడితే 15 సార్లు విజయ దుందుభి మోగించింది. కేవలం 8 సార్లే పరాజయం పాలైంది. ఈ రెండు జట్లు తలపడ్డ ఆఖరి ఐదు మ్యాచుల్లోనూ నాలుగు సార్లు ధోనీ సేననే విజయం వరించింది. ఈ సీజన్‌ తొలి అంచెలో తలపడ్డ మ్యాచులోనూ చెన్నైదే గెలుపు. ఈ హై స్కోరింగ్‌ మ్యాచులో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. డుప్లెసిస్‌ (95 నాటౌట్‌), రుతురాజ్‌ (64), మొయిన్‌ అలీ (25) రెచ్చిపోవడంతో చెన్నై 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఛేదనలో కేకేఆర్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా.. దినేశ్‌ కార్తీక్‌ (40), ఆండ్రీ రసెల్‌ (54), కమిన్స్‌ (66) నాటౌట్‌గా నిలవడంతో 19.1 ఓవర్లకు 202కు ఆలౌటైంది.

Also Read: టీమిండియా బాటలో శ్రీలంక జట్టు.. ధోనీకి పోటీగా బరిలోకి మహేళ జయవర్దనే

చెన్నై జోరే వేరబ్బా!
ఈ ఐపీఎల్‌ను ఎలాగైనా గెలవాలని చెన్నై పట్టుదలతో ఉంది. బహుశా ధోనీకి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తుండొచ్చు. మొదటి అంచెలోని ఫామ్‌లోనూ యూఈలోనూ కొనసాగిస్తోంది. ముంబయి, బెంగళూరును చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. డుప్లెసిస్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అంబటి రాయుడు దుమ్మురేపుతున్నాడు. లోయర్‌ ఆర్డర్‌ నుంచి టాప్‌ ఆర్డర్‌కు మారిన మొయిన్‌ అలీ సైతం రెచ్చిపోతున్నాడు. వీరందరికీ సురేశ్‌ రైనా అండగా ఉంటున్నాడు. వీరిలో ఎవరు ఆడకున్నా ధోనీ, జడ్డూ ఆదుకుంటారు. బౌలింగ్‌లోనూ దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రావో కీలకంగా ఉంటున్నారు. అవసరమైన ప్రతిసారీ వికెట్లు తీస్తున్నారు. శార్దూల్‌, జడ్డూ ఆపదలో ఆదుకుంటున్నారు. సామ్‌  కరన్‌ సైతం వీరికి తోడైతే చెన్నైకి తిరుగుండదు.

Also Read: అయ్యో మిథాలీ సేన! ఆఖర్లో మెలోడ్రామా.. ఇలా ఓడిపోతారనుకోలేదు!

రెచ్చిపోతున్న కోల్‌కతా
ఒకప్పుడు సంచలన ప్రదర్శనలకు మారుపేరైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రానురానూ పేలవంగా మారింది. తొలి అంచెలో నిరాశపరిచిన కేకేఆర్‌ యూఏఈకి రాగానే రెచ్చిపోతోంది. బెంగళూరును 92కే ఆలౌట్‌ చేసిన ఆ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయినీ చిత్తు చేసింది. టాప్‌ ఆర్డర్లో దూకుడు పెరగడం, ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం, బౌలింగ్‌లో వైవిధ్యం తోడవ్వడమే ఇందుకు కారణం. 

యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ రావడంతో ఓపెనింగ్‌లో జోరు పెరిగింది. అతనాడే సిక్సర్లు కనువిందు చేస్తున్నాయి. శుభ్‌మన్‌ గిల్‌  సైతం చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు. ముంబయి మ్యాచులో రాహుల్‌ త్రిపాఠి బ్యాటింగ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. డీకే, మోర్గాన్‌, రసెల్‌కు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. రసెల్‌, ఫెర్గూసన్‌, ప్రసిద్ధ్‌ పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. డెత్‌లో వికెట్లు తీస్తూ పరుగులను నియంత్రిస్తున్నారు. అందుకే చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 26 Sep 2021 09:42 AM (IST) Tags: IPL MS Dhoni IPL 2021 Chennai super kings Kolkata Knight Riders Eoin Morgan CSK vs KKR Venkatesh IYER

ఇవి కూడా చూడండి

Mukesh Kumar:  ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత

Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ ఆ తప్పు చేయకుండా ఉంటే...

Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ ఆ తప్పు చేయకుండా ఉంటే...

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం