![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs ENG 3rd Test: యశస్వి విధ్వంసకర డబుల్ సెంచరీ, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా
Yashasvi Jaiswal: రాజ్‌కోట్ టెస్టులో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్, అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
![IND vs ENG 3rd Test: యశస్వి విధ్వంసకర డబుల్ సెంచరీ, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా Yashasvi Jaiswal Sarfaraz Khan carnage helps IND declare on 430 per 4 IND vs ENG 3rd Test: యశస్వి విధ్వంసకర డబుల్ సెంచరీ, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/733c2d7ebe1a81e408f1a30293a834bb1708245377789872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohit declares! India 430/4 : టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా రెండు టెస్టు మ్యాచుల్లో డబుల్ సెంచరీలు చేశి అదరగొట్టాడు. మరోవైపు అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుసగా తన రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న సమయంలోనే 430/4 వద్ద భారత కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో, భారత్ ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
గిల్ తరువాత బరిలో దిగిన సెంచరీ హీరో యశస్వి జైస్వాల్.. వచ్చీరాగానే వీర బాదుడు మొదలు పెట్టాడు. జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు సాయంతో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్.. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ ద్విశతకాన్ని అందుకున్నాడు. అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సైతం మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 3 సిక్స్‌లు, 6 ఫోర్‌లతో కలిపి 68 పరుగులు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన్అ భారత్ అటు ఇంగ్లాండ్ ను కూడా 319 పరుగులకు పరిమితం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 430/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది.
మూడవ రోజు కూడా యశస్వి జైస్వాల్ వన్డే తరహా బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ గత రోజున 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం వెన్ను నొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)