WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్
టీమిండియా ప్రిన్స్‌గా అభిమానుల ఆదరణ పొందుతున్న శుభ్‌మన్ గిల్‌కు ఓవల్ లో మ్యాచ్ జరుగుతుండగానే పెళ్లి ప్రపోజల్ వచ్చింది.
WTC Final 2023: ఏడాదికాలంగా నిలకడకు నిలువుటద్దంగా మారిన టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వెంట ఇప్పుడిప్పుడే బ్రాండ్స్ క్యూ కడుతున్నాయి. అమ్మాయిల ఫాలోయింగ్ ఇప్పుడిప్పుడే దక్కించుకుంటున్న గిల్‌కు తాజాగా ఓ పెళ్లి ప్రపోజల్ కూడా వచ్చింది. ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మ్యాచ్ జరుగుతుండగానే గిల్‌కు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది.
ఆట మూడో రోజులో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కు వచ్చిన సందర్భంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన యువతి.. ‘మ్యారీ మీ శుభ్‌మన్’ అని ఫ్లకార్డు పట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023
అయితే ఈ ఫోటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గిల్‌కు ఇప్పటికే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో లవ్ అఫైర్ ఉండగా తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారని గుసగుసలు వినిపించాయి. సారా తర్వాత గిల్ మరో సారా (బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్) తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ ఇద్దరూ డేటింగ్ కు వెళ్లిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇద్దరు సారాలు ఉండగా గిల్ మరో అమ్మాయిని కన్నెత్తి చూసే సాహసం చేస్తాడా..? అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Sara Ali Khan & Sara Tendulkar - pic.twitter.com/KHtBnQQKtw
— ABHI 𓀠 (@SRKsABHI) June 9, 2023
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన శుభ్‌మన్.. 17 మ్యాచ్‌లు ఆడి 17 ఇన్నింగ్స్‌లలో 59.33 సగటుతో 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లీగ్ దశలో సెంచరీలు చేసిన గిల్.. ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ లో కూడా శతకం బాదాడు.
ఐపీఎల్-16 కంటే ముందే గిల్.. ఈ ఏడాది వన్డే, టీ20, టెస్టులలో సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్ జట్టు భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.
ఐపీఎల్-16 వరకూ నిలకడగా ఆడిన గిల్ మీద టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. అతడు ఇదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశించింది. కానీ అంచనాలను భిన్నంగా గిల్.. ఆసీస్ తో తొలి ఇన్నింగ్స్ లో 15 బంతులు ఆడి 13 పరుగులే చేసి స్కాట్ బొలాండ్ వేసిన మ్యాజికల్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఒక్కటి కాదని.. అంతేగాక ఇండియాలోని స్లో పిచ్‌లకు ఇంగ్లాండ్ లోని పిచ్ లకు కూడా అతడు తేడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మరి రెండో ఇన్నింగ్స్ లో అయిన గిల్ రాణిస్తాడో చూడాలి.