UPW-W vs RCB-W, 1 Innings Highlight: ఆర్సీబీ గెలిచేట్టుంది - యూపీ వారియర్జ్ 135 ఆలౌట్
WPL 2023, UPW-W vs RCB-W: విమెన్ ప్రీమియర్ లీగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి సాధికారికంగా ఆడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్జ్‌ను మరో 3 బంతులు ఉండగానే 135కి ఆలౌట్ చేసింది.
WPL 2023, UPW-W vs RCB-W:
విమెన్ ప్రీమియర్ లీగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి సాధికారికంగా ఆడింది. పక్కాగా ప్లాన్ చేసి బరిలోకి దిగింది. బౌలర్లు తమ ప్రమాణాలకు తగినట్టుగా బంతులు విసిరారు. టపటపా వికెట్లు పడగొట్టి గెలుపు ఆశలు నిలిపారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్జ్‌ను మరో 3 బంతులు ఉండగానే 135కి ఆలౌట్ చేసింది. యూపీలో గ్రేస్ హ్యారిస్ (46; 32 బంతుల్లో 5x4, 2x6) టాప్ స్కోరర్. దీప్తి శర్మ (22; 19 బంతుల్లో 4x4), కిరణ్ నవగిరె (22; 26 బంతుల్లో 2x4, 1x6) ఆమెకు అండగా నిలిచారు. ఎలిస్ పెర్రీ 3, సోఫీ డివైన్, శోభనా ఆశ తలో 2 వికెట్లు తీశారు.
When the going got tough, @189Grace walked in to bat & changed the momentum with an excellent counter-attacking knock 🔥🔥#TATAWPL | #UPWvRCB
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2023
Relive her innings now 📽️🔽https://t.co/yrKpQQbEoc
'డివైన్' స్టార్ట్!
తాజా వికెట్ కావడంతో టాస్ గెలిచిన ఆర్సీబీ ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్‌కు దించింది. ప్రణాళిక మేరకు బౌలింగ్ చేసింది. తొలి ఓవర్లోనే సోఫీ డివైన్ తన పదునైన స్వింగ్ బౌలింగ్‌తో యూపీ వారియర్జ్‌ను దెబ్బకొట్టింది. రెండో బంతికి దేవికా వైద్య (0)ను గోల్డెన్ డక్ చేసింది. ఆఖరి బంతికి ప్రమాదకర అలీసా హీలీ (1)ను ఔట్ చేసింది. మరికాసేపటికే తాలియా మెక్‌గ్రాత్ (2)ను మేఘాన్ షూట్ పెవిలియన్ పంపింది. దీంతో 5 పరుగులకే యూపీ 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ సిచ్యువేషన్లో గ్రేస్ హ్యారిస్, కిరణ్ నవగిరె తమ జట్టును ఆదుకొన్నారు. ఆచితూచి ఆడుతూనే 26 బంతుల్లో 24 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే జట్టు స్కోరు 29 వద్ద కిరణ్‌ను ఆశా ఔట్ చేసి ఈ జోడీని విడదీసింది. మరో 2 పరుగులకే సిమ్రన్ షేక్ (2)నూ ఆమే ఔట్ చేసింది.
A third for @EllysePerry 🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2023
Shweta Sehrawat is bowled for 8 as #UPW are 120/8 after 18 overs
Follow the match ▶️ https://t.co/uW2g78eMJa#TATAWPL | #UPWvRCB pic.twitter.com/qu8fXkLJPN
ఆ 2 ఓవర్లలో 31 రన్స్
ఎనిమిది ఓవర్లకే 31/5తో కష్టాల్లో పడ్డ యూపీని గ్రేస్ హ్యారిస్ ఆదుకొంది. యువ బౌలర్లు వచ్చే వరకు ఓపికగా ఆడింది. ఆమెకు దీప్తి శర్మ అండగా నిలిచింది. వీరిద్దరూ శ్రేయాంక వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదేసి 15 పరుగులు సాధించారు. తర్వాత ఆశా వేసిన ఓవర్లో హ్యారిస్ రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదేసి 16 పరుగులు రాబట్టింది. కేవలం 2 ఓవర్లలోనే 31 పరుగులు రావడంతో యూపీ స్కోరు వేగం పెరిగింది. వీరిద్దరూ 42 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 14.5 ఓవర్లకు జట్టు స్కోరు 100కు చేరుకుంది. జోరు పెంచిన ఈ జోడీని ఒక పరుగు వ్యవధిలో ఎలిస్ పెర్రీ పెవిలియన్‌కు పంపించి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేసింది. ఆఖర్లో ఎకిల్ స్టోన్ (12), అంజలి శర్వాణి (8) కలిసి స్కోరును 135కు చేర్చారు.
The @UPWarriorz have gained momentum💥@189Grace & @Deepti_Sharma06 score 15 off the 12th over!
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2023
Follow the match ▶️ https://t.co/uW2g78eMJa#TATAWPL | #UPWvRCB pic.twitter.com/0gr0VZmYyl