By: ABP Desam | Updated at : 13 Mar 2023 11:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎలిస్ పెర్రీ ( Image Source : WPL )
DC-W vs RCB-W, 1 Innings Highlight:
దిల్లీ క్యాపిటల్స్‌తో రెండో పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫర్వాలేదనిపించింది. పేసర్లకు సహకరిస్తున్న కఠినమైన పిచ్‌పై డీసెంట్ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి 150 పరుగులు చేసింది. ఆసీస్ సీనియర్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ (67*; 52 బంతుల్లో 4x4, 5x6) రెచ్చిపోయింది. అజేయ అర్ధశతకంతో చెలరేగింది. రిచా ఘోష్ (37; 16 బంతుల్లో 3x4, 3x6) మంచి కేమియోతో ఆకట్టుకుంది. డీసీ ( Delhi Capitals ) పేసర్ శిఖా పాండే (3/23) చక్కని బౌలింగ్‌తో అదరగొట్టింది.
Perry power was on display in the #DCvRCB clash 🔥🔥
Relive @EllysePerry's second consecutive half-century in the #TATAWPL 📽️🔽https://t.co/rfTTS3t9so— Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023
స్మృతి.. నిరాశే!
ఎప్పట్లాగే ఆర్సీబీ (RCB Team)కి కోరుకున్న ఆరంభం దక్కలేదు. ఓపెనర్ స్మృతి మంధాన (8) జట్టు స్కోరు 24 వద్దే పెవిలియన్ చేరి నిరాశ పరిచింది. మొదట్లో కాస్త నిలదొక్కుకొనే ప్రయత్నం చేసినా లెగ్‌సైడ్ బంతి వేసి శిఖా పాండే (Bowler Shika Pandey) ఆమెను ఉచ్చులో పడేసింది. ఫైన్ లెగ్‌లో భారీ షాట్ ఆడేలా చేసి ఔట్ చేసింది. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీ 29/1తో నిలిచింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (21; 19 బంతుల్లో 3x4) షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. 8.6వ బంతికి ఆమెనూ శిఖాయే ఔట్ చేసింది. హీథర్ నైట్ (11) సైతం త్వరగానే డగౌట్ బాట పట్టింది.
Innings Break!@RCBTweets post a competitive total of 150/4 in the first innings 💪🏻
— Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023
Will they successfully defend it or do you reckon #DC will chase this down tonight?
Follow the match ▶️ https://t.co/E13BL45tYr #TATAWPL | #DCvRCB pic.twitter.com/p5Vx4S8QEG
ఆదుకున్న పెర్రీ, రిచా
ఒకవైపు పరుగులు రావడం లేదు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులేస్తున్నారు. అయినా ఎలిస్ పెర్రీ పట్టు వదల్లేదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. అందివచ్చిన బంతుల్ని నేరుగా స్టాండ్స్‌లో పెట్టింది. 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి 16.1 ఓవర్లకు జట్టు స్కోరును 100 పరుగుల మైలురాయికి చేర్చింది. స్లాగ్ ఓవర్లలో ఆర్సీబీ దూకుడు పెంచింది. రిచా ఘోష్ (Richa Ghosh) కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగింది. పెర్రీతో కలిసి నాలుగో వికెట్‌కు 34 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శిఖా పాండే వేసిన 18.2వ బంతిని కీపర్ వెనకాల స్కూప్ ఆడబోయి ఆమె ఔటైంది. ఆఖర్లో ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ ఒకట్రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 150/4కి చేరుకుంది. శ్రేయాంక పాటిల్ (4*)కు కనెక్షన్ కుదర్లేదు.
The Ellyse Perry-Richa Ghosh Effect! 🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023
Three clean hits for three brilliant maximums!
Follow the match ▶️ https://t.co/E13BL45tYr #TATAWPL | #DCvRCB pic.twitter.com/siu8GQruPm
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్ టార్గెట్ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!
UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!