By: ABP Desam | Updated at : 18 Mar 2023 09:25 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గుజరాత్ జెయింట్స్ ( Image Source : WPL )
RCB vs GG, WPL 2023:
గుజరాత్ జెయింట్స్ రెచ్చిపోయింది! విమెన్ ప్రీమియర్ లీగులో మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో దుమ్మురేపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి టార్గెట్ నిర్దేశించింది. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వూల్‌వర్ట్ (68; 42 బంతుల్లో 9x4, 2x6) వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదేసింది. భారీ బౌండరీలతో ప్రత్యర్థి బౌలింగ్ చీల్చిచెండాడింది. ఆమెకు తోడుగా యాష్లే గార్డ్‌నర్ (41; 26 బంతుల్లో 6x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేసింది. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టింది.
.@GujaratGiants post a comprehensive first-innings total of 188/4 🔥🔥
Are win in for a high-scoring thriller? 🤔
Scorecard ▶️ https://t.co/uTxwwRnRxl#TATAWPL | #RCBvGG pic.twitter.com/6Vir5Wu4hA — Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
లారా కొట్టుడు!
బ్యాటింగ్ తీసుకుందే బాదడానికి అన్నట్టుగా ఆడింది గుజరాత్! మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు సోఫియా డాంక్లీ (16), లారా వూల్‌వర్ట్ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే జట్టు స్కోరు 27 వద్ద సోఫియాను డివైన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4x4) అండతో లారా రెచ్చిపోయింది. తనను వేలంలో ఎవరూ కొనలేదేమోనన్న కసో ఏంటో ఆకాశమే హద్దుగా చెలరేగింది. పవర్‌ప్లే ముగిసే సరికి 45/1తో నిలిపింది. రెండో వికెట్‌కు 55 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తెలుగమ్మాయి మేఘన సైతం కొన్ని చక్కని షాట్లు ఆడింది. ప్రీతి బోస్ బౌలింగ్‌లో ఆమెను రిచా స్టంపౌట్ చేసింది. అప్పటికి గుజరాత్ స్కోరు 90.
గార్డ్‌నర్ మెరుపులు
మేఘన ఔటైనా బెంగళూరు కష్టాలు తీరలేదు. యాష్లే గార్డ్‌నర్, లారా ఇద్దరూ బాదుడు షురూ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 52 పరుగులు భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ ఎడాపెడా బాదేయడంతో 17.4 ఓవర్లకు జట్టు స్కోరు 150కి చేరింది. అయితే 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన లారాను అంతకు ముందే శ్రేయాంక పాటిల్ ఔట్ చేసింది. గార్డ్‌నర్‌ను సైతం ఆమే ఎల్బీ చేసింది. ఆఖర్లో హేమలత (16; 6 బంతుల్లో 2x4, 1x6), హర్లీన్ డియోల్ (12; 5 బంతుల్లో 1x4, 1x6) బౌండరీలు, సిక్సర్లు బాదడంతో స్కోరు 188/4కు చేరింది.
A splendid knock by @LauraWolvaardt comes to an end!
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
Shreyanka Patil gets the breakthrough as she departs for 68.
Follow the match ▶️ https://t.co/uTxwwRnRxl#TATAWPL | #RCBvGG pic.twitter.com/N4Wx6KJc2n
For her impeccable fifty, @LauraWolvaardt becomes our 🔝 performer from the first innings!
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
A look at her batting summary 👌🏻#TATAWPL | #RCBvGG pic.twitter.com/fw0pxsGPsk
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!