MI vs UPW: ముంబయికి షాక్ యూపీ రాక్జ్ - ధోనీ స్టైల్లో ఫినిష్ చేసిన ఎకిల్‌స్టోన్!
MI vs UPW: ఓటమెరుగని ముంబయి ఇండియన్స్‌కు షాక్! విమెన్ ప్రీమియర్ లీగులో తొలిసారి ఆ జట్టు ఓటమి పాలైంది. 128 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్‌ను కట్టడి చేయలేకపోయింది.
MI vs UPW:
ఓటమెరుగని ముంబయి ఇండియన్స్‌కు షాక్! హర్మన్ సేన అప్రతిహత విజయ పరంపరకు స్టాప్! విమెన్ ప్రీమియర్ లీగులో తొలిసారి ఆ జట్టు ఓటమి పాలైంది. 128 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్‌ను కట్టడి చేయలేకపోయింది. 5 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. తాహిలా మెక్‌గ్రాత్ (38; 25 బంతుల్లో 6x4, 1x6), గ్రేస్ హ్యారిస్ (39; 28 బంతుల్లో 7x4) యూపీకి విజయం అందించారు. అంతకు ముందు సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15), రాజేశ్వరీ (2/16), దీప్తి (2/35) దెబ్బకు హర్మన్‌సేన విలవిల్లాడింది. 20 ఓవర్లకు 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 30 బంతుల్లో 1x4, 3x6), ఇస్సీ వాంగ్ (25; 19 బంతుల్లో 4x4, 1x6) టాప్ స్కోరర్లు.
మెక్‌గ్రాత్ 'గ్రేస్' బ్యాటింగ్
తక్కువ లక్ష్యమే అయినా ముంబయి ఇండియన్స్ ఆఖరి ఓవర్ వరకు పోరాడింది. చక్కని బౌలింగ్‌తో యూపీ వారియర్జ్‌ను టెన్షన్ పెట్టింది. ఒక పరుగు వద్దే దేవికా వైద్య (1)ను హేలీ మాథ్యూస్ ఔట్ చేసింది. మరికాసేపటికే ప్రమాదకర అలీసా హేలీ (8)ని ఇస్సీ వాంగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి యూపీ 2 వికెట్ల నష్టానికి 27తో నిలిచింది. ఏడో ఓవర్ తొలి బంతికే కిరన్ నవగిరె (12)ను సివర్ బ్రంట్ ఔట్ చేయడంతో ఛేజింగ్ టీమ్‌లో టెన్షన్ పెరిగింది. ఈ సిచ్యువేషన్లో తాహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హ్యారిస్ దూకుడుగా ఆడారు. వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 44 (34) పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 71 వద్ద మెక్‌గ్రాత్‌ను కెర్ ఔట్ చేసింది. దాంతో దీప్తి శర్మ (13 నాటౌట్) అండంతో హ్యారిస్ 15.2 ఓవర్లకు స్కోరును 100కు చేర్చింది. మరో 5 పరుగులకే ఆమెను కెర్ పెవిలియన్‌కు పంపించడంతో యూపీ కంగారూ పడింది. విజయ సమీకరణం 12 బంతుల్లో 13కు మారింది. దీప్తి బౌండరీ బాదేసి 19 ఓవర్లో 8 పరుగులు రాబట్టింది. ఆఖరి 6 బంతుల్లో 5 అవసరం కాగా తొలి 2 బంతులు బీటయ్యాయి. మూడో బంతిని ఎకిల్ స్టోన్ (16 నాఔట్) సిక్సర్ బాదేసి మ్యాచ్ ఫినిష్ చేసింది.
స్పిన్నర్స్ vs ముంబయి
మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు మంచి ఓపెనింగే లభించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ నిలకడగా ఆడింది. యస్తికా భాటియా (7)తో కలిసి తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించింది. 4.5వ బంతికి యస్తికను అంజలీ శర్వాణీ ఔట్ చేసి బ్రేకిచ్చింది. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబయి 31/1తో నిలిచింది. ఆ తర్వాత నాట్ సివర్ (5) ఎకిల్ స్టోన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. కీలకంగా మారిన హేలీని జట్టు స్కోరు 57 వద్ద పెవిలియన్‌కు పంపించింది.
ఈ సిచ్యువేషన్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (25; 22 బంతుల్లో 3x4) నిలబడింది. అమెలియా కెర్ (3)ను రాజేశ్వరి ఔట్ చేసినప్పటికీ ఇస్సీ వాంగ్‌తో కలిసి పోరాడింది. దాంతో 9.5 ఓవర్లకు ఎంఐ 50 పరుగుల మైలు రాయి చేరుకుంది. 14వ ఓవర్లో హర్మన్‌ను దీప్తి శర్మ ఔట్ చేయగానే ముంబయి స్కోరువేగం తగ్గిపోయింది. అనమ్‌జోత్ కౌర్ (5), హమైరా కాజి (4), ధారా గుజ్జర్ (3), సైకా ఇషాక్ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఇస్సీ వాంగ్ పోరాడటంతోనే ముంబయి 127కు చేరుకుంది.
Take a bow @Sophecc19 🙌🏻🙌🏻
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
She finishes in style with a SIX & powers @UPWarriorz to a thrilling win! 👏👏
Scorecard ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/pwR2D2AoLZ