By: ABP Desam | Updated at : 08 Mar 2023 09:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సోఫీ డంక్లీ ( Image Source : wpl )
WPL 2023, RCB-W vs GG-W:
విమెన్ ప్రీమియర్ లీగులో గుజరాత్ జెయింట్స్ జూలు విదిల్చింది! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆకలిగొన్న బెబ్బులిలా విరుచుకుపడింది. ఒకరి తర్వాత ఒకరు వరుసపెట్టి మరీ సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టారు. ప్రత్యర్థికి ఏకంగా 202 టార్గెట్ నిర్దేశించారు. సోఫీ డంక్లీ (65; 28 బంతుల్లో 11x4, 3x6), హర్లీన్ డియోల్ (67; 45 బంతుల్లో 9x4, 1x6) కసికసిగా హాఫ్ సెంచరీలు బాదేశారు. వారి దెబ్బకు ఆర్సీబీ బౌలర్లకు ఏం చేయాలో అర్థమవ్వలేదు. హీథర్ నైట్, శ్రేయాంక చెరో 2 వికెట్లు తీశారు.
A series of quick wickets for @RCBTweets in the last couple of overs! 👍 👍
A wicket each for Renuka Singh Thakur & Shreyanka Patil & a run-out. 👌 👌
Follow the match ▶️ https://t.co/QeECVTM7rl #TATAWPL | #GGvRCB pic.twitter.com/ks5zmITMhn — Women's Premier League (WPL) (@wplt20) March 8, 2023
డంక్లీ కొట్టుడు!
అప్పటికే ఉపయోగించిన పిచ్ కావడంతో గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచుల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంది. ప్రతి ఓవర్లోనూ ఒకట్రెండు సిక్సర్లు బాదేలా, పది పరుగులు వచ్చేలా చూసుకుంది. జట్టు స్కోరు 22 వద్దే తెలుగమ్మాయి మేఘన (8) పెవిలియన్ చేరినా మరో ఓపెనర్ సోఫీ డంక్లీ సివంగిలా రెచ్చిపోయింది. మూడో ఓవర్ నుంచి కళ్లు చెదిరే సిక్సర్లు, చూడచక్కని బౌండరీలు బాదేసింది. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పింది.
6⃣5⃣ Runs
— Women's Premier League (WPL) (@wplt20) March 8, 2023
2⃣8⃣ Balls
1⃣1⃣ Fours
3⃣ Sixes
That was one outstanding knock from @dunkleysophia 🙌 🙌
Relive it here 🎥 👇 #TATAWPL | #GGvRCB | @GujaratGiants https://t.co/MDAiqLTJHk
హర్లీన్ కనిపించని విధ్వంసం
డంక్లీ దూకుడుతో పవర్‌ప్లే ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇదే రేంజ్‌లో బాదేస్తున్న ఆమెను జట్టు స్కోరు 82 వద్ద శ్రేయాంక పాటిల్ ఔట్ చేసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ క్రీజులో నిలిచింది. తొలుత యాష్లే గార్డ్‌నర్ (19)తో కలిసి 53 (36బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 13.5వ బంతికి గార్డ్‌నర్‌ను హీథర్‌నైట్ ఔట్ చేసింది. మరికాసేపటికే దయాలన్ హేమలత (16) పెవిలియన్ చేరింది. బౌండరీలు బాదేస్తున్న హర్లీన్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. జట్టు స్కోరు 196 వద్ద ఆమెను శ్రేయాంక ఔట్ చేసినా గుజరాత్ 201/7కు చేరుకుంది.
FIFTY for @imharleenDeol! 👏 👏
— Women's Premier League (WPL) (@wplt20) March 8, 2023
She continues her good run of form 🙌 🙌@GujaratGiants sail past the 180-run mark.
Follow the match ▶️ https://t.co/QeECVTM7rl #TATAWPL | #GGvRCB pic.twitter.com/6hb5niGK3z
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, దిశా కసత్, ఎలిస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేఘన్ షూట్, రేణుకా సింగ్, ప్రీతి బోస్, పూనమ్ కెమ్నార్
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్ సుథర్‌ల్యాండ్, స్నేహ్ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!
Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం