By: ABP Desam | Updated at : 16 Mar 2023 03:30 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గుజరాత్ జెయింట్స్ ( Image Source : Twitter )
WPL 2023, DC-W vs GG-W:
విమెన్ ప్రీమియర్ లీగులో గురువారం 14వ మ్యాచ్ జరుగుతోంది. దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ బ్రబౌర్న్ వేదికగా తలపడుతున్నాయి. ఇందులో గెలిచి ప్లేఆఫ్‌కు మరింత దగ్గరవ్వాలని డీసీ భావిస్తోంది. రెండో విజయం అందుకోవాలని గుజరాత్ తహతహలాడుతోంది. మరి నేటి పోరులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?
#GiantArmy, who do you think will make it to our starting XI for the all-important clash against DC tonight? 🤔💭
Let us know!👇#DCvGG #WPL2023 #BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/86pKPphG4w— Gujarat Giants (@GujaratGiants) March 16, 2023
ప్లేఆఫ్ రేసులో!
అరంగేట్రం సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఎదురు లేకుండా దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పటిష్ఠంగా ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచులో ఓటమి చవిచూసింది. ఓపెనర్లు మెగ్‌లానింగ్ (Meg Lanning), షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు ఆరంభాలు ఇస్తున్నారు. అలిస్ క్యాప్సీ, మారిజానె కాప్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. వికెట్లు పడకుండా సమయోచితంగా ఆడేందుకు జెమీమా రోడ్రిగ్స్ ఉంది. జెస్ జొనాసెన్, తానియా భాటియా, రాధా యాదవ్ సైతం షాట్లు ఆడగలరు. బౌలింగ్‌లోనూ డీసీని ఆపడం కష్టం. టారా నోరిస్, శిఖా పాండే, కాప్ పేస్ బౌలింగ్ చేస్తున్నారు. రాధా యాదవ్, క్యాప్సీ స్పిన్‌తో చెలరేగుతున్నారు. ఈ జట్టును అడ్డుకోవాలంటే ప్రత్యర్థి చాలా శ్రమించాలి.
రెండో విక్టరీ కోసం!
గుజరాత్ జెయింట్స్‌కు (Gujarat Giants) ఏం చేయాలో అర్థమవ్వడం లేదు. ఇప్పటి వరకు మూడు ఓపెనింగ్ పెయిర్స్‌ను మార్చారు. ఓపెనర్లు కుదురుకోవడం లేదు. నిలబడితే సోఫియా డంక్లీ సిక్సర్లతో చెలరేగగలదు. తెలుగమ్మాయి మేఘన తన స్థాయికి తగినట్టు పరుగులు చేయలేదు. హర్లీన్ డియోల్ (Harleen Deol) మాత్రమే ఆదుకొంటోంది. మంచి ఇంటెంట్‌తో ఆడుతోంది. ఇక ఫీల్డింగ్‌లోనూ మాయ చేస్తోంది. యాష్లే గార్డ్‌నర్, సుథర్ ల్యాండ్ పదేపదే విఫలమవుతున్నారు. హేమలత, స్నేహ రాణా (Sneh Rana), సుష్మా వర్మ త్వరగా ఔటవుతున్నారు. బౌలింగ్ వరకు జెయింట్స్ ఫర్వాలేదు. స్పిన్నర్లు, పేసర్లు బాగానే ఉన్నారు. అయితే పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో ఎక్కువ స్కోర్ లీక్ చేస్తున్నారు.
తుది జట్లు
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్ సుథర్‌ల్యాండ్, రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ
దిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె కాప్, జెస్ జొనాసెన్, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్, టారా నోరిస్
Friends turn #TATAWPL rivals ⚔️
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
Who do you think will come out on 🔝 in #DCvGG tonight❓🧐#YehHaiNayiDilli pic.twitter.com/6TTLR41aqa
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్