అన్వేషించండి

IND vs AUS Final 2023: హార్దిక్‌ పాండ్యా ఉంటే మారేదేమో?, ఇలా మీకూ అనిపిస్తోందా?

India vs Australia World Cup Final 2023: ప్రపంచ క‌ప్‌ ఫైనల్లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాట్‌తోనూ బంతితోనూ సమర్థంగా రాణించే పాండ్యా ఉంటే ఎంతోకొంత మేలు జరిగేది.

World Cup Final 2023: ప్రపంచ క‌ప్‌ ఫైనల్లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా(Hardic Pandya)  లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాట్‌తోనూ బంతితోనూ సమర్థంగా రాణించే పాండ్యా ఉంటే ఆరో బౌలర్‌గానూ.. బ్యాట్స్‌మెన్‌గానూ టీమిండియా(Team India)కు ఎంతోకొంత మేలు జరిగేది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో హార్దిక్‌ లేనిలోటు స్పష్టంగా కనిపించకపోయినా ఫైనల్‌ మ్యాచులో అయితే ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే భారత జట్టులో ఉన్న నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఒక్కడే. బ్యాట్‌తోనే కాక బంతితోనూ పాండ్యా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. వికెట్ల త్వరగా పడితే నిలబడి సమర్థంగా ఆచితూచి ఆడే సామర్థ్యంతో పాటు చివర్లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగల సత్తా పాండ్యా సొంతం. అది టీమిండియాకు ఫైనల్లో కలిసి వచ్చేది.

బౌన్సర్లతో బ్యాటర్లను పాండ్యా ముప్పుతిప్పలు కూడా పెట్టగలడు. టీమిండియాలో ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే మూడో సీమర్‌ పాత్రను పాండ్యా నిర్వర్తించి జట్టు సమతుల్యతను కాపాడేవాడు. కానీ ఇప్పుడు పాండ్యా లేకపోవడంతో జట్టు సమతుల్యత దెబ్బతిని పైనల్లో టీమిండియా బోల్తా పడింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాండ్యా సమర్థంగా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి మెగా టోర్నీలో ఆల్‌రౌండర్‌గా జట్టుకు పాండ్యా సేవలు చాల ముఖ్యమన్నది నిర్వివాద అంశం. ఫీల్డింగ్‌లో కూడా పాండ్యా చాలా చురుగ్గా కదులుతాడు. ఇవన్నీ టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం స్పష్టం కనిపించింది. నాకౌట్‌లో ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఇలాంటి సమయంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు దూరం కావడం టీమిండియాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. హార్దిక్‌ పాండ్యా గాయంతో దూరమవ్వడం కీలక సమయంలో రోహిత్‌ సేనకు భారీగా దెబ్బతీసింది.

పాండ్యా జట్టులో ఉంటే బ్యాటింగ్‌ పరంగా.. బౌలింగ్‌ పరంగా భారత్‌కు ఒక ఆటగాడు ఎక్కువ ఉన్నట్లే లెక్క. ఎవరైనా బౌలర్‌ లయ తప్పితే ఆ స్థానాన్ని పాండ్యాతో భర్తీ చేయవచ్చు. అలా కాకుండా స్పెషలిస్ట్‌ బౌలర్‌నో... స్పెషలిస్ట్‌ బ్యాటర్‌నో తీసుకుంటే వాళ్లు కేవలం అదే విభాగానికి పరిమితం అవుతారు. ఇదీ జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ , ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణిస్తూ టీమిండియా విజయాల్లో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో బ్యాట్‌తో ఇంకా మెరుపులు మెరిపించనప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ రాణించాడు. 

ధర్మశాల వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. హార్దిక్ లేకపోవటంతో కివీస్‌తో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే టీమిండియా ఆడాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ తొలుత భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో పాండ్యా ఉంటే రోహిత్‌కు బౌలింగ్‌ మార్పు చేసే అవకాశం ఉండేది. కానీ ఆరో బౌలర్ లేకపోవటంతో రోహిత్... కుల్దీప్‌నే కొనసాగించాల్సి వచ్చింది. అదే పాండ్యా ఉంటే ఎవరైనా బౌలర్‌ లయ అందుకోకపోతే బౌలింగ్‌ మార్పుగా హార్దిక్‌ను దించే అవకాశం జట్టుకు ఉంటుంది. ఫైనల్లో మాత్రం హార్దిక్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. హార్దిక్‌ ఉంటే.. జడేజా కంటే ముందే అతను క్రీజులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్‌ ఆడేవాడేమో. ఇక బౌలింగ్‌లో హార్దిక్‌ అందుబాటులో ఉంటే.. ఆరో బౌలర్‌గా ఉపయోగపడేవాడు. సిరాజ్‌తో పాటు స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోతున్నపుడు కెప్టెన్‌ అతడి వైపు చూసేవాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget