World Cup NZ vs AFG: లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్! ఫిలిప్స్, యంగ్ హాఫ్ సెంచరీలు- అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం!
World Cup 2023 NZ vs AFG highlights: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు చేసింది.
World Cup 2023 NZ vs AFG Score
చెన్నై: వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో పటిష్ట న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (54 రన్స్; 64 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (20) త్వరగా ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (71; 80 బంతుల్లో 4x4, 4x6), కెప్టెన్ టామ్ లాథమ్ (68; 74 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసి అఫ్గాన్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది. అఫ్గాన్ బౌలర్లలో నవీనుల్ హక్ 2, ఒమర్‌జాయ్ 2, రషీద్ ఖాన్, ముజిబుర్ రెహ్మన్ చెరో వికెట్ తీశారు.
కివీస్ ఓపెనర్ల నుంచి జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ డేవాన్ కాన్వే.. అఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మన్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో 30 పరుగులకే కివీస్ తొలివ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ విల్ యంగ్, రచిన్ రవీంద్ర నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో 20 ఓవర్లకు 109/1 తో పటిష్టంగా కనిపించింది. కానీ కేవలం ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అఫ్టాన్ పేసర్ అజ్మతుల్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 2 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. రెండో బంతికి రచిన్ రవీంద్రను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో చివరి బంతికి విల్ యంగ్ క్యాచ్ ఔటయ్యాడు. మరుసటి ఓవర్లో రషీద్ బ్యాటర్ డారిల్ మిచెల్ ను పెవిలియన్ బాట పట్టించాడు. మిడ్ వికెట్ దిశగా ఆడిన బంతిని ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ పట్టాడు.
మరో వికెట్ పడకుండా 4వ వికెట్ కు ఫిలిప్స్, కెప్టెన్ లాథమ్ 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 48వ ఓవర్లో నవీన్ ఉల్ హక్ షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి ఫిలిప్స్ ను, 3వ బంతికి కెప్టెన్ లాథమ్ ను పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మార్క్ చాప్‌మన్ (25 నాటౌట్; 12 బంతుల్లో 2x4, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం నిలిపింది కివీస్.
🎯 Afghanistan left target of 289
— ICC Cricket World Cup (@cricketworldcup) October 18, 2023
😔 Catching chances go down
🤝 Latham and Phillips rebuild
The story of the first #NZvAFG innings in Chennai 📝 👇https://t.co/nJBsAifkO0