అన్వేషించండి
Advertisement
Shubman gill: గిల్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు
Shubman gill: వన్డేలో రెండు వేల పరుగులను వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కివీస్‌తో జరిగే మ్యాచ్‌లోకి గిల్‌కు అవకాశం ఉంది.
World Cup 2023 Gill Records:
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఇరు జట్ల మధ్య మరో రసవత్తర పోరు ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది. వన్డేలో రెండు వేల పరుగులను వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కివీస్‌తో జరిగే మ్యాచ్‌లోకి గిల్‌కు అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ వన్డేలో 2 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు కేవలం 14 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ మరో 14 పరుగులు సాధిస్తే కొత్త రికార్డును సృష్టిస్తాడు. వన్డేల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా గిల్ అరుదైన రికార్డును సృష్టిస్తాడు. కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే గిల్ 1986 వన్డే పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 వన్డే పరుగులు పూర్తి చేశాడు.
హషీమ్ అమ్లా పేరున..
12 ఏళ్ల క్రితం భారత జట్టుపై హషీమ్ ఆమ్లా ఈ రికార్డు సృష్టించాడు. 2011 జనవరిలో అమ్లా తన 41వ వన్డే మ్యాచ్‌లో 40వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకుని అత్యంత వేగంగా వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన జహీర్ అబ్బాస్ 1983లో 45వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు అమ్లా బద్దలు కొట్టాడు. అబ్బాస్ పేరిట 28 ఏళ్లుగా ఉన్న రికార్డును అమ్లా బద్దలు కొట్టాడు. ఇప్పుడు 12 ఏళ్లుగా అమ్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టే అవశాశం గిల్‌కు లభించింది.
వన్డేలో అద్భుత రికార్డు
శుభ్‌మన్ గిల్ 2019లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో శుభమన్ గిల్ రికార్డు అద్భుతంగా ఉంది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ 37 వన్డేల్లో 66.1 బ్యాటింగ్ సగటుతో 1986 పరుగులు చేశాడు. వన్డేల్లో గిల్ స్ట్రైక్ రేట్ కూడా 102.84 ఉండడం అతను ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో చెబుతుంది. శుభ్‌మన్ 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు.ప్రస్తుతం గిల్ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2 ర్యాంక్‌లో ఉన్నాడు.
ఇటీవలే టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్, టీమిండియా పేస్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి... సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్ నిలిచాడు. సెప్టెంబర్ నెలలో గిల్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్‌త అదరగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు. ఆసియా కప్‌లో 75.5 బ్యాటింగ్ సగటుతో ఈ స్టార్ ఓపెనర్ 302 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion