అన్వేషించండి

Hanuma Vihari: ఇంతకు మించి ఏమీ పీకలేవు ఛాంపియన్, సింపథీ గేమ్ ఆడుకో! విహారికి పృథ్వి రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

Hanuma Vihari: సీనియర్‌ బ్యాటర్ హనుమ విహారి పోస్ట్ కు కౌంటర్‌గా ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ కౌంటర్ పెట్టాడు. ‘మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న ఆ ప్లేయర్‌ నేనే అంటూ వెటకారంగా సమాధానం ఇచ్ఛాడు.

 KN Prudhviraj Responds After Hanuma Vihari Accuses Him:  భవిష్యత్తులో తాను ఆంధ్ర క్రికెట్‌ జట్టు(Andhra Cricket Team) తరఫున ఆడబోనని సీనియర్‌ బ్యాటర్ హనుమ విహారి(Hanuma Vihari) తేల్చి చెప్పారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌(Instgram)లో పోస్టు చేశారు.  ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారడంతో ఈ విషయంపై  ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ అనే మరో క్రికెటర్  కౌంటర్ పెట్టాడు.   

‘మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న ఆ ప్లేయర్‌ ను నేనే. మీరు విన్నదంతా అబద్దం. గేమ్ కంటే ఎవరూ పెద్దవారు కాదు. ఆట నా ఆత్మగౌరవం కంటే పెద్దదేమీ లేదు. వ్యక్తిగత దాడులు, నిందాపూర్వక భాష అది ఇక్కడే కాదు ఏ వేదికమీదనైనా అంగీకారయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ చాంపియన్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు ‘ఒక వేళ నీవు కావాలనుకుంటే ఈ సింపథీ గేమ్ ఆడుకో’ అని రాశాడు. ఇంతకీ  పృధ్వీరాజ్ ఎవరంటే.. తను ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయలేదు.

Hanuma Vihari: ఇంతకు మించి ఏమీ పీకలేవు ఛాంపియన్, సింపథీ గేమ్ ఆడుకో! విహారికి పృథ్వి రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

అసలేం జరిగిందంటే ..

 భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్‌ జట్టు తరఫున ఆడబోనని సీనియర్‌ బ్యాటర్ హనుమ విహారి తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.  మధ్యప్రదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం విహారి ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్‌ నుంచి తప్పించినా జట్టు పట్ల, ఆట పట్ల ప్రేమతో ఇన్నాళ్లు ఆటను కొనసాగించానని పేర్కొన్నారు. ఇకపై ఆంధ్ర తరఫున ఆడబోనని తేల్చిచెప్పారు. రంజీ మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 17వ ఆటగాడిపై అరిచానని తెలిపారు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పడంతో ఆయన తనపైనా చర్యలు తీసుకోవాలని ACAపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. తన వైపున తప్పు లేకపోయినా కెప్టెన్‌ నుంచి తప్పించారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సదరు ఆటగాడిని తాను ఏమి అనలేదని వివరించారు. గతేడాది మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి చేతికి గాయమైనా జట్టు కోసం ఎడమ చేతితోనే బ్యాటింగ్‌ చేశానని గుర్తు చేశారు. అంతే కాదు ఈ విషయం తనతో పాటూ ఉన్న ప్లేయర్ అందరికీ తెలుసు అంటూ వారి సంతకాలు ఉన్న పేపర్ కూడా పోస్ట్ చేశాడు. 

విహారి ఆంధ్ర జట్టు తరఫున  30 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. ప్లేయర్‌గా కూడా సత్తాచాటాడు. 53 సగటుతో 2,262 పరుగులు స్కోర్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆంధ్ర బ్యాటర్లలో విహారి కూడా ఒకడు. 2018లో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన విహారి... ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టు ఓడిపోయే స్థితిలో విహారి వీరోచిత పోరాటం చేశాడు. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 111. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget