వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇంగ్లాండ్ పేరు మీద ఉంది. సెప్టెంబర్ 7, 2025న దక్షిణాఫ్రికాపై 342 పరుగుల తేడాతో గెలిచింది.
Biggest Wins in ODI : వన్డే క్రికెట్ చరిత్రలో 5 అతిపెద్ద విజయాలేవి? మొదటి స్థానంలో ఉన్న జట్టు ఏది? ఎంత తేడాతో మ్యాచ్ గెలిచింది?
Biggest Wins in ODI : వన్డే చరిత్రలో అతిపెద్ద విజయాలు ఇంగ్లండ్ పేరున ఉన్నాయి. భారత్ రెండుసార్లు 300+ పరుగుల తేడాతో గెలిచింది.

Biggest Wins in ODI : వన్డే క్రికెట్ 54 సంవత్సరాల క్రితం జనవరి 5, 1971న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో అనేక రికార్డులు నమోదు అవుతూ వస్తున్నాయి. పాత రికార్డులు చెరిగిపోతున్నాయి. కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఏళ్ల తరబడి కొన్ని రికార్డులు అన్‌బ్రేకబుల్‌గా ఉండిపోయాయి. ఇలాంటి కొన్నిసార్లు పెద్ద పెద్ద జట్ల పేరు మీద కాకుండా చిన్న చిన్న జట్ల పేరు మీద ఉంటున్నాయి. అలాంటి రికార్డుల్లో 300కుపైగా పరుగులతో విజయం సాధించడం. ఈ లీస్ట్‌లో జింబాంబ్వే లాంటి చిన్న జట్టు ఉంది. కానీ ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లో ఉన్న జట్లు లేకపోవడం క్రికెట్‌లో ఉన్న మజాను తెలియజేస్తోంది.
వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం 342 పరుగులతో గెలిచిందే ఉంది. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో కేవలం 5 జట్లు మాత్రమే 300 కంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. భారత్ వన్డే క్రికెట్‌లో రెండుసార్లు 300 కంటే ఎక్కువ పరుగులతో గెలిచింది. జింబాబ్వే కూడా ఒకసారి ఇలాంటి ఘనత సాధించింది, దాని గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా 5 అతిపెద్ద విజయాల గురించి తెలుసుకుందాం. ఇందులో చాలా ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో 5 అతిపెద్ద విజయాలు
1. ఇంగ్లాండ్ - 342 పరుగుల తేడాతో విజయం
వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇంగ్లాండ్ పేరు మీద ఉంది. ఇంగ్లాండ్ సెప్టెంబర్ 7, 2025న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై 342 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
2. భారత్ - 317 పరుగుల తేడాతో విజయం
భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. జనవరి 15, 2023న తిరువనంతపురంలో శ్రీలంకపై టీమ్ ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది.
3. ఆస్ట్రేలియా - 309 పరుగుల తేడాతో విజయం
వన్డే క్రికెట్ చరిత్రలో మూడో అతిపెద్ద విజయం ఆస్ట్రేలియా పేరు మీద ఉంది. ఆస్ట్రేలియా అక్టోబర్ 25, 2023న ఢిల్లీలో నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో గెలిచింది.
4. జింబాబ్వే - 304 పరుగుల తేడాతో విజయం
జింబాబ్వే వన్డే క్రికెట్ చరిత్రలో నాల్గో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే జూన్ 26, 2023న హరారేలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై 304 పరుగుల తేడాతో విజయం సాధించింది.
5. భారత్ - 302 పరుగుల తేడాతో విజయం
వన్డే క్రికెట్ చరిత్రలో ఐదో అతిపెద్ద విజయం కూడా భారత్ పేరు మీద ఉంది. నవంబర్ 2, 2023న వాంఖడేలో శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో గెలిచింది.
వన్డే క్రికెట్ చరిత్ర 54 సంవత్సరాల నాటిది. ఈ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు కేవలం 5 దేశాలు మాత్రమే ఒక మ్యాచ్‌లో 300 కంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. ఇలాంటి ఘనతను రెండుసార్లు సాధించిన ఏకైక జట్టు టీమ్ ఇండియా. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి పెద్ద జట్లు ఈ ఘనత సాధించలేకపోయాయి, అయితే జింబాబ్వే వంటి చిన్న జట్టు ఈ ఘనతను సాధించింది.
Frequently Asked Questions
వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఏది?
300 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఎన్ని జట్లు గెలిచాయి?
వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 5 జట్లు మాత్రమే 300 కంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. భారత్ ఈ ఘనతను రెండుసార్లు సాధించింది.
భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో 300 కంటే ఎక్కువ పరుగులతో ఎప్పుడు గెలిచింది?
భారత్ జనవరి 15, 2023న శ్రీలంకపై 317 పరుగుల తేడాతో, మరియు నవంబర్ 2, 2023న శ్రీలంకపై 302 పరుగుల తేడాతో గెలిచింది.
జింబాబ్వే వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిందా?
అవును, జింబాబ్వే జూన్ 26, 2023న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై 304 పరుగుల తేడాతో గెలిచి, వన్డే క్రికెట్ చరిత్రలో నాల్గవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.




















