అన్వేషించండి
Advertisement
WI vs AFG, T20 World Cup 2024: చితకొట్టిన పూరన్, విండీస్ చేతిలో అఫ్గాన్ చిత్తు
Nicholas Pooran: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 53 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 98 పరుగులు చేశాడు.
West Indies vs Afghanistan Highlights: చివరి లీగ్ మ్యాచ్‌ను అఫ్గాన్( Afghanistan)ను చిత్తు చేసిన వెస్డిండీస్(West Indies)... పూర్తి ఆత్మవిశ్వాసంతో సూపర్ ఎయిట్‌కు సిద్ధమైంది. చివరి లీగ్ మ్యాచ్‌లో విండీస్ విధ్వంసం ముందు అఫ్గాన్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోలస్ పూరన్(Nicholas Pooran) విధ్వంసంతో మొదట 218 పరుగుల భారీ స్కోరు చేసిన విండీస్.. ఆ తర్వాత అఫ్గాన్‌ను కేవలం 114 పరుగులకే పరిమితం చేసింది. దీంతో 140 పరుగుల తేడాతో చివరి లీగ్ మ్యాచ్‌లో విండీస్ ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్ డీ అగ్రస్థానంలో విండీస్ సూపర్ 8కు అర్హత సాధించింది.
పూరన్ ఊచకోత
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే విండీస్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. జాన్సన్ చార్లెస్ అఫ్గాన్ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడి చేశాడు. కానీ ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేసిన బ్రెండన్ కింగ్‌ను అవుట్ చేసిన ఒమ్రాజాయ్ 22 పరుగుల వద్ద తొలి విండీస్ వికెట్‌ను నేలకూల్చాడు. ఈ వికెట్ పడ్డ సంతోషం అఫ్గాన్‌కు ఎక్కువసేపు నిలవలేదు. జాన్సన్ చార్లెస్‌కు జత కలిసిన నికోలస్ పూరన్ ఈ ప్రపంచకప్‌లో తొలిసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి అఫ్గాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. 27 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 43 పరుగులు చేసి చార్లెస్ అవుటయ్యాడు. చార్లెస్ అవుటైనా నికోలస్ పూరన్ మాత్రం ధాటిగా ఆడాడు. టీ 20ల్లో తానెంతటి విలువైన ఆటగాడినో పూరన్ మరోసారి చాటిచెప్పాడు. ముఖ్యంగా సూపర్ ఎయిట్‌కు ముందు పూరన్ మళ్లీ ఫామ్‌ను అందుకోవడం విండీస్‌కు కలిసివచ్చింది. ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించిన పూరన్ కేవలం 53 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. కానీ 98 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు రనౌట్ అయి సెంచరీని చేజార్చుకున్నాడు. కేవలం రెండు పరుగుల దూరంలో పూరన్.. అవుట్ కావడం తీవ్ర నిరాశను మిగిల్చింది. పూరన్ అవుటైనా ఆ తర్వాత వచ్చిన విండీస్ బ్యాటర్లు మెరుపు బ్యాటింగ్ చేశారు. షై హోప్, రొమన్ పావెల్ కూడా ధాటిగా ఆడారు. షై హోప్ 17 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరగా... రొమన్ పావెల్ 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. పూరన్, షైహోప్, పావెల్ బ్యాటింగ్‌తో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో నబీ రెండు, ఒమ్రాజాయ్, నవీనుల్ హక్ చెరో వికెట్ తీశారు.
కుప్పకూలిన అఫ్గాన్
219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ను విండీస్ బౌలర్లు కుప్పకూల్చారు. మొత్తం 20 ఓవర్లు కూడా ఆడలేకపోయిన అఫ్గాన్ 16.2 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. సమష్టిగా రాణించిన కరేబియన్ బౌలర్లు.. అఫ్గాన్ బ్యాటర్లకు క్రీజులో కుదురుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడు బంతికే గుర్బాజ్‌ను అవుట్ చేసిన హొసైన్ అఫ్గాన్ బ్యాటింగ్ పతనాన్ని ఆరంభించాడు. ఇబ్రహీం జర్దాన్ ఒక్కడే 38 పరుగులతో రాణించాడు. ఒమ్రాజాయ్ 23 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. . దీంతో 140 పరుగుల తేడాతో చివరి లీగ్ మ్యాచ్‌లో విండీస్ ఘన విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion