AUS vs WI 2nd Test మిమ్మల్ని కొట్టడానికి ఈ కండలు సరిపోతాయా..? ఆస్ట్రేలియాకు విండీస్ కెప్టెన్ స్ట్రాంగ్ కౌంటర్
Brath White Comments On Australia: మ్యాచ్ తర్వాత వెస్టిండీస్ జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ ఇచ్చిన ఓ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది.
![AUS vs WI 2nd Test మిమ్మల్ని కొట్టడానికి ఈ కండలు సరిపోతాయా..? ఆస్ట్రేలియాకు విండీస్ కెప్టెన్ స్ట్రాంగ్ కౌంటర్ West Indies captain Brath White gave a strong counter to former Australian cricketer Hogg after 2nd Test winning AUS vs WI 2nd Test మిమ్మల్ని కొట్టడానికి ఈ కండలు సరిపోతాయా..? ఆస్ట్రేలియాకు విండీస్ కెప్టెన్ స్ట్రాంగ్ కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/82cdf518259b8d0efc41ee421d7d649c1706498952123215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
West Indies VS Australia: విండీస్ జట్టు నిన్న ఆస్ట్రేలియా గడ్డ మీద, అది కూడా చారిత్రక గబ్బా స్టేడియం(Gabba Stadium)లో చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డ మీద 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అది కూడా కేవలం 216 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ. ఈ విజయాన్ని వెస్టిండీస్ జట్టు సభ్యులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు మరియు అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతటి అపురూప విజయం ఇది.
హాగ్ వివాదాస్పద కామెంట్స్
మ్యాచ్ తర్వాత వెస్టిండీస్ జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్(Craig Brathwaite) ఇచ్చిన ఓ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఈ రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ ఫలితం తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రాడ్నీ హాగ్(Rodney Hogg), వెస్టిండీస్ మీద సంచలన కామెంట్స్ చేశాడు. ఇదొక Pathetic జట్టని, అసలు ఏమాత్రం ఆశలు పెట్టుకోలేమని అన్నాడు.
కండలు చూపిస్తూ..
కట్ చేస్తే రెండో టెస్టులో వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో మాట్లాడుతూ కెప్టెన్ బ్రాత్ వైట్ హాగ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ కు ముందు తమకు రెండే పదాలు ఇన్స్పిరేషన్ ను ఇచ్చాయని, అవి రాడ్నీ హాగ్ అన్న Pathetic మరియు Hopeless అని బ్రాత్ వైట్ అన్నాడు. తాము Pathetic కాదని ప్రపంచానికి చూపించాలనుకున్నామని బ్రాత్ వైట్ అన్నాడు. ఈ మాత్రం కండలు నీకు సరిపోతాయా అంటూ తన బైసెప్స్ చూపిస్తూ రాడ్నీ హాగ్ కు బ్రాత్ వైట్ గట్టి పంచ్ వేశాడు. మ్యాచ్ గెలవడమే కాక, మ్యాచ్ తర్వాత ట్రోల్స్ కు వెస్టిండీస్ కెప్టెన్ గట్టి పంచ్ క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)