News
News
X

Virat Kohli: కోహ్లీ అస్సలు తినని కూరేంటో తెలుసా! మనలో చాలా మందికి ఇది ఇష్టముండదు!

Virat Kohli: విరాట్‌ కోహ్లీ అంటే గుర్తొచ్చేది ఫిట్‌నెస్‌! తన దేహాన్ని పటిష్ఠంగా ఉంచుకొనేందుకు అతడెంతో శ్రమిస్తాడు. గంటల కొద్దీ జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. అలాగే అతడు ప్రాధాన్యం ఇచ్చే మరో అంశం ఆహారం.

FOLLOW US: 
Share:

Virat Kohli:

విరాట్‌ కోహ్లీ అంటే గుర్తొచ్చేది ఫిట్‌నెస్‌! తన దేహాన్ని పటిష్ఠంగా ఉంచుకొనేందుకు అతడెంతో శ్రమిస్తాడు. గంటల కొద్దీ జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. అలాగే అతడు ప్రాధాన్యం ఇచ్చే మరో అంశం ఆహారం.

టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్ (Virat Kohli) మంచి ఆహార ప్రియుడు! ఏ దేశానికి వెళ్లినా స్థానిక వంటకాలను రుచి చూస్తుంటాడు. దేహ దారుఢ్యాన్ని పెంచే ఆహార పదార్థాలకే ఓటేస్తాడు. 'చోలె బాతుర్‌' కనిపిస్తే మాత్రం ఆగలేడు. అలాగే అతడికి ఇష్టం లేని, అస్సలు తినని కూరేంటో అభిమానులతో పంచుకున్నాడు.

ఆస్ట్రేలియాపై రెండో టెస్టు (IND vs AUS 2nd Test) గెలిచాక విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' సెషన్‌ నిర్వహించాడు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. తానిప్పుడు శాకహారినని పేర్కొన్నాడు. తన జీవితంలో తినని ఒకేఒక్క కూరగాయ 'కాకర కాయ' అని వివరించాడు.

తాను తిన్న ఘోరమైన ఆహార పదార్థమేంటో కోహ్లీ వివరించాడు. 'మలేసియాలో ఒక పరుగుల కూర రుచిచూశాను. అదేంటో నాకు తెలియదు. దానిని ఫ్రై చేశారు. రుచి చూశాక అసహ్యం వేసింది' అని వెల్లడించాడు. 'చోలె బాతుర్‌' తానిష్టడే చీట్‌ మీల్‌ అని పేర్కొన్నాడు.

తన అతిపెద్ద ఫ్యాషన్‌ పొరపాటు గురించి కోహ్లీ వివరించాడు. 'కొన్నాళ్ల ముందు మొత్తం హీల్‌ ఉంటే బూట్లు వేసుకొనేవాడిని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాటిని మళ్లీ వాటిని వేసుకోవడాన్ని ఊహించుకోలేను. కొన్ని రోజులు ప్రింట్‌ చేసిన చొక్కాలను ఇష్టంగా వేసుకున్నాను' అని విరాట్‌ పేర్కొన్నాడు. 'ఇప్పుడు పై నుంచి కింద వరకు డ్రెస్‌ చేసుకోవడం సౌకర్యంగా అనిపించడం లేదు' అని పేర్కొన్నాడు.

రెండో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వద్ద ఒక సరదా సన్నివేశం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ కోచ్ ద్రవిడ్ తో ఏదో చర్చిస్తుండగా సిబ్బంది ఒకరు ఆహారం తీసుకువచ్చారు. కోహ్లీ దానివైపు చూస్తూ వావ్ అంటూ చప్పట్లు కొట్టడం కనిపించింది. కోహ్లీ హావభావాలు చూసి ఆ వంటకం అతనికి చాలా ఇష్టమైనదానిలా అనిపించింది. అయితే ఆ ఫుడ్ ప్యాకెట్ లో ఏముందో వీడియోలో కనిపించలేదు. 

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, ఫ్యాన్స్ తమకు నచ్చిన కామెంట్లు పెడుతున్నారు. 'అది కోహ్లీకి ఇష్టమైన చోలే బటూరే లా అయి ఉంటుందని' ఒకరు కామెంట్ చేశారు. 'ఢిల్లీ, చోలే బటూర్, ఒక ప్రేమకథ' అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా దీనిపై స్పందిస్తూ.. 'రామా చోలే బటూరే నుంచి ఆర్డర్ వస్తే రియాక్షన్ ఇలానే ఉంటుంది' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. 

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

Published at : 20 Feb 2023 02:31 PM (IST) Tags: Team India Kohli Ind vs Aus VIRAT KOHLI

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత