అన్వేషించండి

Virat Kohli: అనుమానాలకు చెక్‌ పెడుతూ, సఫారీ గడ్డపై కాలుమోపిన కోహ్లీ

Virat Kohli: అనుమానాలకు చెక్‌ పెడుతూ టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే మైదానంలో చెమట చిందించాడు.

అనుమానాలకు చెక్‌ పెడుతూ టీమిండియా(TEam India) స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) దక్షిణాఫ్రికా(South Africa) తో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే మైదానంలో చెమట చిందించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్‌ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ప్రత్యేకించి కారణం తెలియకపోయినా కోహ్లీ ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు నాటికి అతడు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మళ్లీ దక్షిణాఫ్రికాతో జట్టును కలిసిన కోహ్లీ... ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశాడు.

Image

ప్రపంచకప్‌ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ (Rohit Sharma)కూడా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. కోహ్లీ, రోహిత్‌ నెట్స్‌లో చెమటోడ్చారు. ఇద్దరూ బ్యాటింగ్‌ సాధనపైనే దృష్టిసారించారు. మూడు గంటల పాటు సాగిన సాధనను చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) పర్యవేక్షించాడు. కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయగా.. యశస్వి జైశ్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ స్లిప్‌ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఇక పిచ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో నాలుగో బౌలర్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను ఆడించే అవకాశముంది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. 

Image

సఫారీ గడ్డపై టీ 20సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇప్పుడు టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే గాయాలు భారత జట్టును వేధిస్తున్నాయి. గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ తప్పుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.. ఇషాన్ కిషన్ స్థానంలో కె. ఎస్. భరత్ ను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్‌ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Image

చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్‌ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్‌ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది. రుతురాజ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని... అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వెల్లడించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారత్‌కు వస్తాడని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో బెంగాల్‌ ప్లేయర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ టెస్ట్‌ సిరీస్‌కు దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్‌ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొం‍డిచేయే ఎదురైంది. 

Image

ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొంద‌డం భార‌త్‌కు చాలా కీలకం. అయితే.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై భార‌త జ‌ట్టు ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి అయిన అంద‌ని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ష‌మీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జ‌ర‌గ‌నుంది.

 

Image

Image

Image

Image

Image

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ap DSC 2024: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
Andhra Politics: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
Rashmika Mandanna: అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?
అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP DesamBorugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ap DSC 2024: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
Andhra Politics: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
Rashmika Mandanna: అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?
అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?
NBK 109 Title: బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
Telngana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
Supreme Court: బుల్డోజర్ జస్టిస్ సరికాదు- నిందితుల ఇళ్లు కూల్చడంపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
బుల్డోజర్ జస్టిస్ సరికాదు- నిందితుల ఇళ్లు కూల్చడంపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
Embed widget