Shubman Gill: నవయుగం నీదే - నడిపించు - గిల్‌కు ఛేజ్ మాస్టర్ ప్రశంసలు
IPL 2023: గుజరాత్ టైటాన్స్ తరఫున తొలి సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్ పై టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.
Virat Kohli Praised Shubman Gill: టీమిండియా యువ సంచలనం, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న శుబ్‌మన్ గిల్ ఈ లీగ్ లో తొలి సెంచరీ నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన గిల్.. ఐపీఎల్ లో శతకంతో తనకు ఎదురేలేదని చాటుతున్నాడు. గిల్ శతకంపై టీమిండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. రాబోయే రోజుల్లో క్రికెట్‌ను నడిపించేది నువ్వేనంటూ కొనియాడాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో గిల్ శతకం చేసిన తర్వాత కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా స్పందించాడు. గిల్ సెంచరీ మూమెంట్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఎక్కడ సామర్థ్యం ఉందో అక్కడ గిల్ ఉంటాడు. ఇలాగే ముందుకు సాగుతూ రాబోయే తరాన్ని నడిపించు. గాడ్ బ్లెస్ యూ @శుబ్‌మన్ గిల్’అని రాసుకొచ్చాడు. కోహ్లీ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టుపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ.. కోహ్లీకి నెక్స్ట్ క్రికెట్ ను రూల్ చేసేదెవరో తెలసుని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మీటింగ్‌కు లేట్‌గా వచ్చాడని! - వధెరకు వెరైటీ శిక్ష వేసిన ముంబై ఇండియన్స్
Virat Kohli knows who is the future of World Cricket. pic.twitter.com/mh2cDbvCoa
— Johns. (@CricCrazyJohns) May 16, 2023
కోహ్లీ తర్వాత భారత జట్టును నడిపించేది గిల్ అని ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆ మేరకు గిల్ కూడా ఫార్మాట్ ఏదైనా దానికి తగ్గట్టుగా తన ఆటను మార్చుకుంటున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సెంచరీల మోతెక్కిస్తున్న గిల్.. సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత తన రోల్ మోడల్ కోహ్లీ అని చెప్పాడు.
గిల్ మాట్లాడుతూ.. ‘సచిన్, విరాట్ భాయ్ లను నేను ఆరాధిస్తా. విరాట్ భాయ్ నా హీరో. ఆట పట్ల అతడికి ఉన్న ప్యాషన్, కమిట్‌మెంట్, ఎనర్జీ నాకు నిత్యం స్ఫూర్తిని రగులుస్తాయి..’అని చెప్పాడు. గిల్ - కోహ్లీలు ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై కలిసి శతకాలు బాదిన విషయం తెలిసిందే.
Special moment on a special night 💜⚡️ pic.twitter.com/vJeBEptH0A
— Shubman Gill (@ShubmanGill) May 15, 2023
అరుదైన జాబితాలో గిల్..
ఐపీఎల్ లో సెంచరీ చేయడం ద్వారా గిల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో సెంచరీ చేసి ఐపీఎల్ లో కూడా శతకాలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో గిల్ కూడా చేరాడు. ఇంతకుముందు ఈ ఘనత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ ల సరసన చేరాడు. వీళ్లంతా అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్ లతో కూడా శతకాలు చేసినవారే. ఇంటర్నేషనల్ లెవల్ లో సెంచరీ చేసి ఐపీఎల్‌లో సెంచరీ చేయని ఒకే ఒక బ్యాటర్ దీపక్ హుడా.
Also Read: గిల్ ఆన్ డ్యూటీ - లేనే లేదు పోటీ - ఫార్మాట్ ఏదైనా సెంచరీలు చేయడంలో మేటి
మూడు ఫార్మాట్ లలో సెంచరీలు చేసినా గిల్ కు ఐపీఎల్ లో సెంచరీ లేని లోటు వెంటాడింది. సన్ రైజర్స్ తో సెంచరీకి ముందు గిల్ రెండు సార్లు 90 లలోకి వచ్చినా శతకం చేయలేదు. ఆఖరికి ఇదే అహ్మదాబాద్ వేదికగాపై లక్నోతో ఆడిన గత మ్యాచ్ లో కూడా 94 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కానీ హైదరాబాద్‌తో మాత్రం ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. తద్వారా ఈ ఏడాది అన్ని ఫార్మట్లతో పాటు ఐపీఎల్‌లో కూడా సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.