Virat Kohli New Look: సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో విరాట్ కోహ్లీ- రంగు వేసుకోలేదా కింగ్ అంటున్న ఫ్యాన్స్
Virat Kohli New Look:విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత కనిపించాడు. ఈసారి ఆయన లుక్ చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli New Look: విరాట్ కోహ్లీని బ్లూ జెర్సీలో క్రికెట్ గ్రౌండ్‌లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ అంతా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్‌లో దిగిన ఈ ఫొటోలో విరాట్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. మ్యాచ్‌లు ఉన్నప్పుడు చాలా యంగ్ అండ్ ఎనెర్జిటిక్‌గా కనిపించే కోహ్లీ ఈసారి మాత్రం వయసుపైబడిన వ్యక్తిలా దర్శనం ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు.
ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టెస్టు, టీ 20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన విరాట్ కోహ్లీ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అందుకే ఈ మధ్య ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడలేదు. అందుకే భారత్ వన్డేలు ఎప్పుడెప్పుడు ఆడుతుందా కోహ్లీ బ్యాటింగ్ ఆట ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.
అలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు కోహ్లీ ఓ ఫోటోతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇండియాకు చెందిన ఎంట్రప్రెన్యూర్ షాస్‌తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో కోహ్లీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. లైట్ గ్రే టీ షర్ట్ దానిపై డార్క్‌గ్రే కలర్ హుడీ వేసుకొని ఉన్నాడు. అయితే కోహ్లీ తెల్లని గెడ్డంతో కనిపించడంఫ్యాన్స్‌ను కాస్త షాక్‌కి గురి చేసింది.
View this post on Instagram
ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన షాస్, కింగ్ కోహ్లీతో దిగిన ఈ ఫొటోకు క్యాప్షన్ అవసరం లేదు కదా అని రాసుకొచ్చాడు.
ఈ మధ్య కాలంలో తన గెడ్డానికి కలర్ వేస్తానని ఈ మధ్యే కోహ్లీ వెల్లడించాడు. యువరాజ్ సింగ్ నిర్వహించిన ఫండ్‌రైజింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న కోహ్లీ సీక్రెట్‌ను రివీల్ చేశాడు. " నా గెడ్డానికి ఈ మధ్యే కలర్ వేశాను. నువ్వు కలర్ వేయడం ప్రారంభిస్తే ప్రతి నాలుగు రోజులకొకసారి వేయాల్సిందే." అని చెప్పాడు.
కోహ్లీ ఫీల్డ్‌లో ఎప్పుడు కనిపిస్తాడు?
టీమిండియా ఈ మధ్య ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఆడి ఇండియాకు తిరిగి వచ్చింది. తర్వాత బంగ్లాదేశ్‌తో టీ 20, వన్డే సిరీస్ ఆడే అవకాశం ఉంది. ఇది ఆగస్టులోనే జరగాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ వచ్చే ఏడాదికి పోస్టుపోన్ చేసింది. ఇరు దేశాల బోర్డుల అంగీకారంతో ఇది 2026 సెప్టెంబర్‌లో జరగనుంది. ఆ వన్డే సిరీస్ అనుకున్నట్టు జరిగి ఉంటే కోహ్లీతోపాటు రోహిత్ శర్మ కూడా ఫీల్డ్‌లో కనిపించేవాడు.
ప్రస్తుతానికి వన్డే సిరీస్‌లో ఏమీ ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అక్టోబర్ వరకు ఫీల్డ్‌లో కనిపించబోరు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా.అందులో వీళ్లిద్దరు కనిపించనున్నారు. ఆగస్టులో వన్డే సిరీస్ ఆడేందుకు రావాలని శ్రీలంక ఆహ్వానించింది. కానీ లాంగ్ సిరీస్‌లు ఆడిన ఆటగాళ్లకు పూర్తిగా రెస్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు వన్డే సిరీస్ ఆడించలేమని బీసీసీఐ ప్రకటించింది. దీంతో అక్టోబర్ వరకు కోహ్లీ, రోహిత్ జోడీని ఫీల్డ్‌లో చూడలేరు.




















