Kohli Fined: కోహ్లీకి షాకిచ్చిన ఐసీసీ.. జరిమానాతో కన్నెర్ర.. బాక్సింగ్ డే తొలిరోజు వివాదానికి ఫుల్ స్టాప్
ICC Fires On Kohli: మైదానంలో దూకుడుగా ప్రవర్తించి కోహ్లీ కి ఐసీసీ బ్రేకులు వేసింది. బాక్సింగ్ డే తొలి రోజున నమోదైన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
Boxing Day Test Updates: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. ఆసీస్ ప్లేయర్ శామ్ కొన్ స్టాస్ ను ఢీకొనడంతోపాటు వాగ్వాదానికి దిగినందుకుగాను అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. బాక్సింగ్ డే తొలిరోజు ఆట ముగిసిన తరవాత మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ విచారణ చేశారు. అయితే కోహ్లీ తన తప్పును అంగీకరించడంతో అతనికి లెవల్-1 నేరానికి పాలడ్డాడని తేల్చిన ఐసీసీ, అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయంచడంతోపాటు జరిమానా కూడా విధించారు. అంతకుముందు ఈ ఘటనకు సంబంధించి కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకోవాని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ డిమాండ్ చేశారు. నిజానికి కొన్ స్టాస్ తో ఢీకొనడంతోపాటు అతనితో వాగ్వాదానికి కూడా కోహ్లీ దిగాడు. మరో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితి సద్ధుమణిగేలా చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన క్లిప్పింగ్ చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూ చేశారు.
11వ ఓవర్లో డ్రామా..
నిజానికి ఈ ఘటనఇన్నింగ్స్ 11వ ఓవర్లో జరిగింది. ఆ ఓవర్ ను బుమ్రా వేయగా, బంతిని కొన్ స్టాస్ ఆడాడు. దీంతో ఓవర్ ముగిసింది. ఆ తర్వాత బంతిని తీసుకున్న కోహ్లీ.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి స్ట్రైకర్ వైపు వెళుతున్న కొన్ స్టాస్ ను ఢీకొట్టాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే తనను ఢీకొట్టిన తర్వాత కొన్ స్టాస్ ఏదో మాట అనగా, దానికి కోహ్లీ జవాబిచ్చాడు. ఈ అంశం ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఆ తర్వాత ఆటగాళ్లు, అంపైర్ల చొరవతో ఈ వివాదం సద్దుమణిగింది. దీనిపై తాజాగా పాంటింగ్, వాన్ చర్చ లేవనేత్తారు.
ఆటలో సహజమే..
తొలిరోజు ఆట ముగిశాక ఈ ఘటనపై కోన్ స్టాస్ స్పందించాడు. ఆటలో ఇలాంటివి సహజమేనని, భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు ఇలాంటివి జరుగుతాయని తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు ఇదే మ్యాచ్ లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఈ ఓపెనర్ సత్తా చాటాడు. వన్డే తరహాలో ఆడుతూ మెరుపు అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ వివాదంపై మాజీ లు పాంటింగ్, వాన్ ఓవర్ యాక్షన్ చేశారు. దారిన వెళుతున్న కొన్ స్టాస్ ను కోహ్లీనే ఢీకొట్టాడని, తన దారి మార్చుకుని మరీ కొన్ స్టాస్ కి అడ్డు తగిలాడని పాంటింగ్ ఆరోపించాడు. అత్యంత అనుభవం కల ఆటగాడు, స్టార్ ప్లేయర్ అయిన కోహ్లీ ఇలాంటి పని చేయడం సరికాదని పేర్కొన్నాడు. మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కోహ్లీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మరోవైపు అతనికి వాన్ కూడా వంతపాడుతున్నాడు. అయితే ఈ అంశంపై ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే.. ఎవరైనా ప్లేయర్ లేద సహాయక సిబ్బంది, అంపైర్లను కానీ ఉద్దేశ పూర్వకంగా ఢీకొడితే అది ఆర్టికల్ 2.12 కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనికి తప్పును బట్టి, మ్యాచ్ నిషేధం లేదా మ్యాచ్ ఫీజులో జరిమానా విధిస్తారు. అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ తప్పిదాన్ని అంగీకరించడంతోపాటు కొన్ స్టాస్ కూడా సానుకూలంగానే స్పందించడంతో చిన్న జరిమానాతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో మ్యాచ్ అంపైర్లు ఇయాన్ గౌల్డ్, జోయెల్ గార్నర్, థర్డ్ అంపైర్ షరీఫుద్దౌలా, ఫోర్త్ అంపైర్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.