అన్వేషించండి
Advertisement
Virat Kohli: వికిపీడియాలోనూ కోహ్లీ నామస్మరణే
Virat Kohli : గతేడాది ఆసియా వ్యాప్తంగా వికిపీడియాలో నెటిజన్లు అత్యధికంగా చూసిన పేజీలలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి తన ఫ్యాన్స్ బేస్‌ను ప్రపంచానికి చాటిచెప్పాడు.
విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రికెట్ లోనే కాదు ప్రపంచంలో అసలు ఎవరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఈ రన్ మెషీన్ గురించి చాలా చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తే. రికార్డుల్లోకానీ... ఆటలో గానీ, సోషల్ మీడియా క్రేజ్‌లో గానీ, బ్రాండ్‌ల విషయంలో గానీ కోహ్లీకి సరితూగే ఆడగాడు దరిదాపుల్లో కూడా లేడు. ఇప్పటికే గూగుల్ (Google) పాతికేళ్ల చరిత్రలో అత్యధిక మంది శోధించిన క్రికెటర్‌గా టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీ... మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. గతేడాది ఆసియా వ్యాప్తంగా వికిపీడియాలో నెటిజన్లు అత్యధికంగా చూసిన పేజీలలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి తన ఫ్యాన్స్ బేస్‌ను ప్రపంచానికి చాటిచెప్పాడు. ప్రముఖ పాప్ సింగర్, దక్షిణ కొరియాకు చెందిన బీటీఎస్ జంగ్‌కుక్‌ను అధిగమించి కోహ్లీ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు.
2023లో టాప్ 2లో కోహ్లీ
2023లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ 2,048 పరుగులతో రెండో స్థానం (ఫస్ట్ ప్లేస్‌లో గిల్ 2,154) లో ఉన్నాడు. ఇందులో ఏడు సెంచరీలు (ఐదు వన్డే శతకాలు) ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌లో భారత్ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ.. తన విశ్వరూపం చూపాడు. వన్డే వరల్డ్ కప్‌లోనే సచిన్ 49 సెంచరీ(వన్డేలలో) ల రికార్డును చెరిపేసి 50వ శతకం కూడా పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 53.25 సగటుతో 639 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ శతకాలున్నాయి. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సచిన్ సెంచరీల రికార్డును బ్రేక్ చేసినప్పుడు వికిపీడియాలో కోహ్లీ గురించి ఎక్కువమంది సెర్చ్ చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. డిసెంబర్ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్ లుక్ బిజెనెస్ ఈ జాబితా రూపొందించగా అందులో కోహ్లీకి స్థానం దక్కింది.
ఎన్నో రికార్డులు
పదిహేనేళ్ల కెరియర్‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 50 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్‌టైమ్ రికార్డును అధిగమించాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌లో 80 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. 2023లో కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఏడు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో తనదైన ఆటతో అదరగొడుతున్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 90 సగటుతో 713కిపైగా పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలతో పాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement