అన్వేషించండి

Sachin Vs Kambli: సచిన్ తో విబేధాలపై స్పందించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ సవాలుకు సై అన్న మాజీ క్రికెటర్

Sachin Tendulkar: సచిన్ చిన్ననాటి స్నేహితుడైన కాంబ్లీ.. భారత జట్టులోకి వెల్లువగా దూసుకొచ్చాడు. 2009లో సచినతో అతనికి విబేధాలు ఏర్పాడ్డాయి. 

Vinod Kambli: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో విభేదాలపై మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మనసు విప్పాడు. 2009లో అతడిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే విభేధాలు వచ్చాయని తెలిపాడు. నిజానికి సచిన్ తనకెంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఇటీవల తన ఆరోగ్యం చాలా దెబ్బతిందని కాంబ్లి చెప్పుకొచ్చాడు. యూరిన్ సమస్య రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు. కోచ్ రామకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమం కోసం ఇటీవల సచిన్, కాంబ్లీ ఒకే వేదికను పంచుకున్నారు. అయితే కనీసం లేచి నిలబడలేని స్థితిలో కాంబ్లీ కనిపించడం అభిమానులకు షాక్ కు గురి చేసింది. బీసీసీఐ మాజీ క్రికెటర్లకు ఇచ్చే రూ.30 వేల పెన్షన్ పైనే బతుకు వెళ్ల దీస్తున్నట్లు వివరించాడు. అయితే కాంబ్లీ దీన స్థితిపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. 

షరతు విధించిన కపిల్..
కాంబ్లీకి సాయం చేసేందుకు 1983 గెలిచిన భారత జట్టు సభ్యులంతా సిద్ధంగా ఉన్నామని, అయితే కాంబ్లీ ఒక షరతుకు ఒప్పుకోవాలని కపిల్ సూచించాడు. వెంటనే అతను రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లాలని కోరాడు. తాగుడు వ్యసనానికి బానిస కావడంతో కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిదన్న ప్రచారం ఉంది.  తాజాగా దీనిపై కాంబ్లీ స్పందించాడు. తాను కపిల్ పెట్టిన షరతు ప్రకారం రిహబిలిటేషన్ సెంటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాని తెలిపాడు. ఇటీవల తన ఆరోగ్యం చాలా పాడైపోయిందని, తన భార్య దగ్గరుండి మరీ చూసుకుంటుందని వివరించాడు. ఇప్పటికే మూడు ఆస్పత్రులకు తనను తీసుకెళ్లిందని, మూత్రం ఆగకపోవడమనే సమస్యను తను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాడు. తన కుమారుడు క్రిస్టియానో, పదేళ్ల కూతురు నిత్యం తనను అంటి పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపాడు. 

Also Read: MS Dhoni: ధోనీతో వివాదంపై స్పందించిన ఎల్ఎస్జీ ఓనర్ గోయెంకా

గతంలో సచిన్ ఎంతో సాయం..
తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ ను తాను అపార్థం చేసుకున్నట్లు కాంబ్లీ వెల్లడించాడు. నిజానికి సచిన్ తనకెంతో సాయం చేశాడని, రెండుసార్లు హాస్పిటల్ బిల్లులు కూడా చెల్లించినట్లు తెలిపాడు. ఒకదశలో సచిన్ తన కోసం ఏమీ చేయలేదని నిరాశపడ్డానని, అయితే తనకోసం చేయాల్సిందంతా సచిన్ చేశాడని వివరించాడు. కెరీర్ సమయంలో ఎలా ఆడాలో సచిన్ చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. తన ప్రొత్సాహం వల్లే జట్టులోకి తొమ్మిది సార్లు కంబ్యాక్ చేసినట్లు వెల్లడించాడు. క్రికెటర్లకు గాయాలు ఆటలో సహజమని, వాటిని తట్టుకుని ముందుకు వెళ్లినవారే నిలబడుతారని పేర్కొన్నాడు.

వాంఖడే వేదికగా తను చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేనని కాంబ్లీ తెలిపాడు. ఆ సమయంలో అచ్రేకర్ సర్ తనతో ఉండేవారని, క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ తో పోటీ పడేవాణ్ని అని, ఆ యుద్ధం సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. 1991-2000 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కాంబ్లీ.. 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందుల నాలుగు సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 227. ఇక 104 వన్డేల్లో 32.59 సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 106 కావడం విశేషం. 

Also Read: Ind Vs Aus Test Series: 'గబ్బా'లో గెలిస్తే సిరీస్ సొంతమైనట్లే.. రోహిత్ ఆ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలి... మాజీ కోచ్ సూచన
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Embed widget