Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర! రంజీ ట్రోఫీలో అతి చిన్న వయస్సు వైస్ కెప్టెన్‌గా రికార్డు
Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో మొదలు పెట్టిన రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రంజీ ట్రోఫీకి బిహార్ వైఎస్‌కెప్టెన్‌గా ఎంపికై మరో కీలకమైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

Vaibhav Suryavanshi: 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచనాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన కొద్ది రోజులకే మరో రికార్డు సృష్టించారు. రంజీ ట్రోఫీలో ఆడే టీంకు 14 ఏళ్లకే వైఎస్ కెప్టెన్‌గా నియమితులై సరికొత్త చరిత్ర తన పేరున లిఖించుకున్నారు.
వైభవ్ సూర్యవంశీ 2025–26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు మ్యాచ్‌లకు బిహార్ సీనియర్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా నియమితులయ్యారు. దీనితో టోర్నమెంట్ చరిత్రలో వైస్-కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. బిహార్ అక్టోబర్ 15న అరుణాచల్ ప్రదేశ్‌తో తన జర్నీని ప్రారంభిస్తుంది, ఆ తర్వాత అక్టోబర్ 25న మణిపూర్‌తో తలపడుతుంది.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు ఆకట్టుకున్న నేపథ్యంలో సూర్యవంశీ ఈ స్థాయికి ఎదిగాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో 78 బంతుల్లో సెంచరీ చేశాడు.
📢 Bihar Squad Announced for 1st Two #RanjiTrophy Matches!
— Bihar Cricket Association (@BiharCriBoard) October 12, 2025
🧢 Captain: Sakibul Gani⁰⭐ Vice-Captain: Vaibhav Suryavanshi
A strong mix of youth & experience..⁰Vaibhav’s rise continues after a stellar IPL & U-19 season.. #TeamBihar #BiharCricket #Ranji2025 #VaibhavSuryavansh pic.twitter.com/vk9ScT97UC
చిన్న వయసులోనే అతని నిలకడ, పరిణతి అతన్ని నాయకత్వ పాత్రకు ప్రోత్సహించేలా సెలెక్టర్లను మెప్పించాయని తెలుస్తోంది. ఆ సిరీస్‌లో అతను రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌లో ఎదుగుదల
2024లో కేవలం 12 సంవత్సరాల వయసులో బిహార్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన సూర్యవంశీ తొలి ప్రదర్శన చాలా సింపుల్‌గా ఉంది. తన మొదటి 10 ఇన్నింగ్స్‌ల్లో 100 పరుగులు సాధించాడు, కానీ తర్వాత స్పీడ్ పెంచాడు.
యువ కుడిచేతి వాటం ఆటగాడు IPL 2025లో పటాకాలా పేలాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున 38 బంతుల్లో సెంచరీతో పురుషుల T20 క్రికెట్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన సెంచరీ కొట్టిన ప్లేయర్ అయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 వన్డే సిరీస్‌లో కూడా మూడు ఇన్నింగ్స్‌లలో 41 కంటే ఎక్కువ సగటుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో, అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 71 సగటుతో 355 పరుగులు సాధించాడు, వాటిలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.
ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లలో, సూర్యవంశీ 206 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇది అతని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని, టీనేజర్‌గా అద్భుతమైన ప్రశాంతతను నొక్కి చెబుతుంది.
బిహార్ రంజీ ట్రోఫీ జట్టు
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు సకిబుల్ గని కెప్టెన్‌గా నియమితులయ్యారు. పూర్తి జట్టు జాబితా ఇక్కడ చూడొచ్చు:
సకిబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్-కెప్టెన్), పియూష్ కుమార్ సింగ్, భాస్కర్ దూబే, అర్ణవ్ కిషోర్, ఆయుష్ లోహరుకా, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్, ఖలీద్ ఆలం, సచిన్ కుమార్.




















