భారత్- పాక్ మ్యాచ్‌లో ఊర్వశి రౌటెలా.. మీమర్స్ కు పండగే!
భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కు బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రిషభ్ పంత్ కు తుది జట్టులో చోటు దొరకని సమయంలో ఆమె కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆసియా కప్‌లో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటు దొరకని సమయంలో ఆమె మైదానంలో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఊర్వశి రౌటెలా, రిషభ్ పంత్ మధ్య ఇటీవల జరిగిన పరిణామాలతో క్యూరియాసిటీ ఏర్పాడింది. దీనిపై నెట్టింట్లో సరదా మీమ్స్ నడుస్తున్నాయి. తాను క్రికెట్ చూడనని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలాంటిది ఇప్పుడు తను మ్యాచ్ కు హాజరవటంతో నెటిజన్లకు మరింత ఫీడ్ దొరికినట్లయింది. ఒక అభిమాని ఖాతాలో కనిపించిన తన పోస్ట్ ను ఇన్ స్టా లో రీపోస్ట్ చేసింది ఊర్వశి. దానికి ఇండియా వర్సెస్ పాక్ అని టాగ్ లైన్ రాసింది.
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా మధ్యఇటీవల మాటల యుద్ధం నడిచింది. తన కోసం గతంలో ఆర్పీ అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో చాలాసేపు ఎదురు చూశాడంటూ ఊర్వశి చెప్పింది. దానిపై రిషభ్ ఘాటుగా స్పందించాడు. దానిపై మళ్లీ ఈ బాలీవుడ్ నటి కౌంటర్ ఇచ్చింది.
అసలు వారిమధ్య ఏం జరిగిందంటే..
మిస్టర్ ఆర్పీ అనే వ్యక్తి తనను కలవడం కోసం చాలా కాలం ఎదురు చూశాడని ఊర్వశి రౌటెలా చెప్పింది. తను వారణాసిలో షూటింగ్ ముగించుకుని దిల్లీలోని హోటల్ కు చేరుకునేసరికి అక్కడ ఆర్పీ అనే వ్యక్తి తన కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పింది. అయితే తాను అలసిపోవటంతో గదిలోకి వెళ్లి పడుకున్నానని తెలిపింది. లేచి చూసేసరికి తన ఫోన్ కు 16, 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. తన కోసం ఎదురుచూసేవారిని కలవలేకపోయినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. ఆ తర్వాత ముంబయిలో తాము కలిశామని చెప్పింది. అయితే ఆర్పీ అంటే ఎవరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేసింది.
ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ కావటంతో రిషబ్ పంత్ స్పందిస్తూ.. ఆమె పేరు ప్రస్తావించకుండానే కొంత మంది ఫేమ్ కోసం అబద్ధాలు ఆడతారని అన్నాడు. వారి స్వార్థం కోసం అవతలి వ్యక్తుల్ని బలి చేస్తారనే అర్థం వచ్చేలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్లీజ్ అక్క నన్ను వదిలేయంటూ హ్యాష్ ట్యాగ్ తో కౌంటరిచ్చాడు ఈయంగ్ క్రికెటర్.
ఇది చూసిన బాలీవుడ్ నటి రిషభ్ ను కౌగర్ హంటర్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఛోటూ భయ్యా నువ్వు బ్యాట్, బాల్ ఆడుకో. నేను మున్నీని కాదు అంటూ ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా ఈ పోస్టుకు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆర్పీ భయ్యా అంటూ కామెంట్ రాసింది.
Rishabh Pant After Seeing Urvashi Rautela In Stands pic.twitter.com/AVHxGt4Eh8
— Vikas Trivedi🇮🇳 (@IamVtrived) August 28, 2022
Urvashi rautela after watching today's playing XI#INDvPAK pic.twitter.com/eFkUWcHiyU
— tweetakudu (@tweetakudu) August 28, 2022
Only person having evil laugh after seeing urvashi rautela in the stadium#INDvPAK pic.twitter.com/MDfylgxivC
— a. (@abhaysrivastavv) August 28, 2022
Rishabh Pant and Urvashi Rautela at the stadium pic.twitter.com/HRodTfsRvi
— PrinCe (@Prince8bx) August 28, 2022
ఈ ఇద్దరి మధ్య నడిచిన ట్వీట్ ఫైట్ నెటిజన్లకు మంచి విందుభోజనాన్నే అందించింది. రెండు మూడ్రోజులైతే వీళ్లపై మీమ్స్‌లో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ వివాదం నడుస్తుండగానే సడెన్‌గా రౌటెలా గ్రౌండ్‌లో కనిపించి మరోసారి నెటిజన్లకు పని చెప్పారు.
— 𝑺𝒓𝒆𝒆𝒉𝒂𝒓𝒔𝒉 𝑮𝒊𝒓𝒆𝒆𝒔𝒉 (@Sreeharsh27) August 29, 2022