![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ - ఈ అద్భుతం జరిగితే సాధ్యమే!
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ ఆడాలంటే ఈ సమీకరణాలు జరగాలి.
![T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ - ఈ అద్భుతం జరిగితే సాధ్యమే! This is How India Pakistan Can Play Each Other In T20 World Cup 2022 Final T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ - ఈ అద్భుతం జరిగితే సాధ్యమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/e0fcc35dc345676f4effb2ba96b7aa011667659843111252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్‌వైపు చూస్తుంది. మ్యాచ్ జరిగే సమయంలో ఎమోషన్స్ కూడా అదేస్థాయిలో ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2022లో రెండు జట్లు ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. సూపర్ 12 స్టేజ్‌లోని గ్రూప్ 2 మ్యాచ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఇక్కడ రోహిత్ శర్మ జట్టు అతి తక్కువ తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్రూప్ 2 మ్యాచ్‌లు సాగిన తీరు, పాకిస్తాన్‌కు కలిసిరాలేదు. కానీ పూర్తిగా పోటీ నుంచి మాత్రం తొలిగిపోలేదు.
టీ20 ప్రపంచ కప్ 2022 ఫార్మాట్‌ను ఏర్పాటు చేసిన విధానంలో ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్‌కు అవకాశం ఉంది. కానీ భారతదేశం సెమీ ఫైనల్‌కు దాదాపు చేరిపోగా, పాకిస్తాన్ సంగతి మాత్రం ఇతర ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఇంకా సాధ్యమేనా?
అవును, ఇది ఇప్పటికీ సాధ్యమే కానీ గ్రూప్ 2 నుంచి ఒక మ్యాచ్ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండాలి. ఆదివారం జరిగే తమ చివరి సూపర్ 12 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించి, బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ ఓడించినట్లయితే పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. జింబాబ్వేతో తలపడుతున్న భారత్ తదుపరి రౌండ్‌కు వెళ్లాలంటే తమ చివరి గ్రూప్ గేమ్‌ను కూడా గెలవాలి.
ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ ఆడాలంటే జరగాల్సిన సమీకరణాలు ఇవే!
సౌత్ ఆఫ్రికా vs నెదర్లాండ్స్ = నెదర్లాండ్స్ గెలవాలి
పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ = పాకిస్తాన్ గెలవాలి
భారతదేశం vs జింబాబ్వే = భారతదేశం గెలవాలి
ఇండియా vs ఇంగ్లండ్ సెమీ ఫైనల్ = భారత్ గెలవాలి
న్యూజిలాండ్ vs పాకిస్తాన్ సెమీ-ఫైనల్ = పాకిస్తాన్ గెలవాలి
ఫైనల్ = ఇండియా vs పాకిస్తాన్
ఇలాంటి పరిస్థితుల్లో భారత్, పాకిస్తాన్‌లు సెమీస్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో తలపడతాయి. ఆసియా దిగ్గజాలు తమ తమ మ్యాచ్‌ల్లో గెలిస్తే, నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో పోటీ పడనున్నాయి.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)