అన్వేషించండి
Advertisement
India vs South Africa 2nd Test: 120 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండోసారి
IND vs SA 2nd Test: ఎప్పుడో 120 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు 25 వికెట్లు నేలకూలాయి. మళ్లీ దాదాపు శతాబ్దం తర్వాత ఈ మ్యాచ్‌లో ఒకేరోజు 23 వికెట్లు పడ్డాయి.
పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సీమర్లు నిప్పులు చెరిగిన వేళ దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్‌లో... తొలిరోజే 23 వికెట్లు కుప్పకూలాయి. తొలి రోజే ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించి మూడు వికెట్లు కోల్పోయింది. ఇరు జట్లు చెత్త రికార్డులు నమోదు చేసిన ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్ స్వల్ప పైచేయి సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్ల పడిన. రెండో టెస్ట్‌గా ఇది నిలిచింది. 1902లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్‌లో తొలిరోజు 25 వికెట్లు నేలకూలగా తర్వాత ఈ మ్యాచ్‌లోనే 23 వికెట్లు పడ్డాయి.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలిరోజు ఆటలో పెను సంచలనం నమోదైంది. కేప్‌టౌన్‌లో పూర్తిగా పేసర్లకు సహకరించిన పిచ్‌పై............ ఇరు జట్ల సీమర్లు నిప్పులు చెరిగారు. తొలి రోజే 23 వికెట్లు నేలకూల్చి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశారు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా తొలిరోజే ఇన్ని వికెట్లు పడడం ఇది రెండోసారే కావడం గమనార్హం. ఎప్పుడో 120 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు 25 వికెట్లు నేలకూలాయి. మళ్లీ దాదాపు శతాబ్దం తర్వాత ఈ మ్యాచ్‌లో ఒకేరోజు 23 వికెట్లు పడ్డాయి. 1902లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరగగా... ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మ్యాచ్ జరిగింది.
పేసర్లకు వికెట్ల పండగే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్.. బ్యాటింగ్‌కు దిగింది. మహ్మద్ సిరాజ్ కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్ బ్యాటర్ల వద్ద సమాధానమే కరువైంది. సిరాజ్ దెబ్బకు సఫారీ జట్టు 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. అనంతరం బుమ్రా, ముఖేష్‌కుమార్ కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ఆరు, బుమ్రా, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.. 1992లో క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్‌కాగా.. ప్రొటీస్ బ్యాటర్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
భారత్‌కు కూడా తిప్పలే
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 153 పరుగులకు 5 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా........ తర్వాత అదే స్కోరు వద్ద ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కోహ్లీ 46, రోహిత్ శర్మ 39, శుభ్‌మన్ గిల్ 36 పరుగులతో పర్వాలేదనిపించారు. మరింత భారీ ఆధిక్యం ఖాయమనుకున్న దశలో... లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి..మ్యాచ్‌ను మలుపు తిప్పారు. సఫారీ సీమర్ల ధాటికి భారత్‌లో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 98 పరుగుల ఆధిక్యం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ అపఖ్యాతిని టీమిండియా మూటగట్టుగుంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153కు నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా... అదే 153 పరుగుల వద్ద 153 ఆలౌట్ అయింది. టీమిండియా 98 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం తొలి రోజే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టు..... 62 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ కంటే ప్రొటీస్ ఇంకా 36 పరుగులు వెనకపడి ఉంది. రేపటి తొలి సెషన్ ఇరు జట్లకు కీలకం కానుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion