Aus Vs Ind Test Series: నాలుగో టెస్టుకు ఆసీస్ కొత్త అస్త్రం - 19 ఏళ్ల ఓపెనర్‌తో ప్రయోగం, మిగతా రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఆసీస్
Melbourne Test: ఈనెల 26 నుంచి ప్రారంభయమ్యే బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ కొత్త అస్త్రంతో ముందుకువస్తోంది. 19 ఏళ్ల టీనేజర్‌ను తాజాగా జట్టులోకి తీసుకుంది.

Cricket News: భారత జట్టుతో జరిగే చివరి రెండు టెస్టులకు ఆస్ర్టేలియా టీమ్‌ను ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టులో రెండు కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న యువ ఓపెనర్ నాథన్ మెక్ స్వినీకి ఉద్వాసన పలికింది. అతని స్థానంలో మరో యువ బ్యాటర్ 19 ఏళ్ల సామ్ కొన్స్టాస్‌ను జట్టులోకి తీసుకుంది. అతను ఉస్మాన్ ఖవాజాతో కలిపి ఓపెనింగ్ చేసే అవకాశముంది. ఇక పేసర్ జై రిచర్డ్సన్‌ను జట్టులోకి తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అతను జాతీయ జట్టులోకి రావడం విశేషం. కాలి పిక్క గాయంతో స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఆసీస్ ఈ మార్పును చేసింది.
ప్రాక్టీస్ మ్యాచ్ లో శతక్కొట్టిన కొన్ స్టాస్..
దూకుడైన ఆటతీరుకు కొన్ స్టాప్ చిరునామాలా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాపార్డర్‌లో వేగంగా ఆడగలదు. ఇక దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధించిన అనుభవం ఉంది. షెఫీల్డ్ షీల్డు టోర్నీలో రెండు సెంచరీలు చేశాడు. టోర్నీలో న్యూ సౌత్ వేల్స్ బ్యాటింగ్‌లో కీలకంగా వ్యవహరించాడు. అలాగే భారత్, ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్ల జరిగిన మ్యాచ్‌లోనూ బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (97 బంతుల్లో 107, 14 ఫోర్లు, ఒక సిక్సర్)తో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అంతకు ముందు భారత్-ఎ, ఆసీస్-ఎ జట్ల మధ్య జరిగిన అనధికార రెండు టెస్టుల్లోనూ బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా 92 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని జాతీయ జట్టులోకి అతడిని సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన వెటరన్ ఖవాజా.. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అతడిని కొనసాగించినట్లు ఉన్నారు.
26 నుంచి నాలుగో టెస్టు..
ఇరు జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ పోటాపోటీగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు టెస్టులు జరుగగా, రెండింటిలో ఫలితం తేలగా, మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 295 పరుగులతో తొలి టెస్టును భారత్ కైవసం చేసుకోగా, పది వికెట్లతో రెండో టెస్టును కంగారూలు దక్కించుకున్నారు. ఇక నాలుగో టెస్టు బాక్సింగ్ డే రోజును మెల్బ్రోర్న్‌లో ఈ నెల 26 నుంచి జరుగుతుంది. ఆ తర్వాత ఐదో టెస్టు సిడ్నీలో జనవరి మూడు నుంచి ప్రారంభమవుతుంది.
టీమిండియాతో చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా,సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

