Team India: భారత్ కు బయలుదేరిన విశ్వ విజేతలు, ఆనందంతో ఫోటోలు షేర్ చేస్తున్న క్రికెటర్లు
T20 World Cup 2024: టీ 20 ప్రపంచ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలచిన టీం ఇండియా బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు బయలు దేరింది.రేపు ఉదయానికి టీం భారత్ కు చేరనుంది.
Home Coming team India: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup)ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు బార్బడోస్(Barbados)లో తుఫాను లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి వాతావరణం కాస్త అనుకూలంగా మారటం, అలాగే భారత్ పంపిన ప్రత్యేక విమానం అక్కడ చేరుకోవడంతో జట్టు సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆటగాళ్ళు ఆనందంతో సోషల్ మీడియా లో ఫోటోలు పోస్ట్ చేస్తునారు.
జూన్ 29న టీ 20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన తరువాత నుంచి భారత జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ద్వీప భూమిలో తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇతర ప్రాంతాలకు రాక పోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం తుఫాను విరామం ఇవ్వటంతో గెలిచిన రెండురోజుల తరువాత ఆటగాళ్ళు స్వదేశానికి రానున్నారు. దీంతో ఆటగాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ లు చేస్తున్నారు. కమింగ్ హోమ్ అంటూ రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ తో కలిసి ఫోటోను ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు.
CAPTAIN ROHIT SHARMA'S INSTAGRAM POST 🇮🇳 pic.twitter.com/epRSMgLbwk
— Johns. (@CricCrazyJohns) July 3, 2024
అర్ష దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, సిరాజ్ లు కూడా తమ ఇంస్టా లో స్టేటస్ పెట్టారు, అలాగే శివం దుబే కూడా కప్ పట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
T20I WORLD CUP TROPHY IS COMING BACK TO INDIA AFTER 17 LONG YEARS...!!!! 🇮🇳
— Johns. (@CricCrazyJohns) July 3, 2024
- The Heroes will reach tomorrow. [Nikhil Naz] pic.twitter.com/3pk57TL7Oy
ఇక ఇప్పటికే బీసీసీఐ టీ 20 ప్రపంచకప్ భారత్‌కు వచ్చేస్తోందంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియొ పోస్ట్ చేసింది. దీంతో భారత అభిమానులు ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మరో వైపు భారత్ కు చేరిన తరువాత జట్టు సభ్యులు ప్రధాన మంత్రి మోదీని కలిసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 2007లో టీమిండియా మొదటిసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో తొలి విజయం సాధించినప్పుడు మొత్తం జట్టును ఒక ఓపెన్ బస్సులో ముంబై నగరంలో తిప్పారు. ఆ రోజున క్రీడాకారులకు స్వాగతం పలికేందుకు వీధులన్నీ వేలాది మంది అభిమానులతో నిండిపోయాయి. ముంబయి నగరం అంతటా ఈ బస్సు చక్కర్లు కొట్టింది. టీం ఇండియా విజయాన్ని 11 మంది ఆటగాళ్లే కాదు, యావత్ దేశాన్ని వేడుకగా జరుపుకుంది. ఇప్పుడు రెండవసారి ట్రోఫీ భారత్ కి రానుండటంతో అప్పటి ఫోటోలు కూడా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Can't wait to see these types of scenes in Mumbai of Team India with T20 World Cup Trophy...!!!!🏆❤️
— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024
- THIS IS GOING TO BE GOOSEBUMPS. 🇮🇳 pic.twitter.com/o25c2dJDdZ