T20 World Cup 2022: కోవిడ్ నిబంధనలను సడలించిన ఐసీసీ - ఈసారి కరోనా వచ్చినా?
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌కు కరోనా వైరస్ నిబంధనలను ఐసీసీ సడలించింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ఐసీసీ COVID-19 నిబంధనలను సడలించింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను కూడా టోర్నమెంట్‌కు అనుమతిస్తామని పేర్కొంది. టోర్నీ సమయంలో ఎటువంటి తప్పనిసరి పరీక్షలు ఉండవని, ఎవరికైనా కోవిడ్-19 వస్తే జట్టుకు ఐసోలేషన్ టైం కూడా ఉండదని ఐసీసీ చెప్పింది. ఒక ఆటగాడికి కరోనా వైరస్ సోకినప్పటికీ ఆ ఆటగాడు ఉన్న జట్టు మ్యాచ్ ఆడటం సాధ్యం అవుతుందా లేదా అన్న విషయంపై ఐసీసీ వైద్యులను సంప్రదించింది.
అంటే జట్టులో ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే మరో ఆటగాడితో మ్యాచ్ ఆడవచ్చన్న మాట. ఈ సంవత్సరం ప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఇదే విధమైన వైఖరిని అవలంబించారు. ఇందులో వైరస్‌కు పాజిటివ్ అని తేలిన వ్యక్తులు ఒక్కొక్కటిగా నిర్వహించబడ్డారు మరియు పాల్గొనకుండా నిరోధించాల్సిన అవసరం లేదు.
ఎనిమిదో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ అతిపెద్దది, అత్యుత్తమమైనది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ మధ్య ఏడు ఆస్ట్రేలియన్ నగరాల్లో 16 జట్లు 45 మ్యాచ్‌లు ఆడుతున్నాయి.
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022ను ఆస్ట్రేలియాలోని ఏడు వేదికల్లో నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుంది. సెమీ ఫైనల్స్ అడిలైడ్ ఓవల్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్నాయి. బ్రిస్బేన్‌లోని గబ్బా, గీలాంగ్‌లోని కార్డినియా పార్క్, హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ మరియు పెర్త్ స్టేడియం ఇతర ఆతిథ్య వేదికలు.
View this post on Instagram
View this post on Instagram