అన్వేషించండి
Advertisement
T20 World Cup 2024 semi-finals: ఇక మిగిలింది మూడే రోజులు- సెమీస్‌లో ఎవరితో ఎవరంటే?
T20 World Cup 2024 semi finals: టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్ జట్లు ఫైనల్ అయిపోయాయి. సూపర్-8 గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు, గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ అర్హత సాధించాయి.
Semi-final schedule confirmed for T20 World Cup: టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో ఇక సెమీస్ సమరం మొదలుకానుంది. బంగ్లాదేశ్(Ban)పై అఫ్గాన్(Afg) గెలుపుతో పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ ఎయిట్ దశకు నాటకీయ ముగింపు పడింది. ఇక మిగిలిన నాలుగు అగ్ర జట్లు... టీ 20 ప్రపంచకప్ సెమీస్‌కు సిద్ధమవుతున్నాయి. ఇందులో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా(India)..డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్(England) గ్రూప్ వన్ నుంచి సెమీస్‌కు దూసుకెళ్లాయి. ఇక ఆస్ట్రేలియా(AUS)ను స్వదేశానికి పంపిన అఫ్గానిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా (SA)సెమీస్ సమరానికి సై అంటున్నాయి. ఈ నాలుగు జట్ల మధ్య భీకర పోరు ఖాయమని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.
గ్రూప్ వన్‌లో ఇలా...
టీ 20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్‌లో అఫ్గాన్ గెలుపుతో నాలుగు బెర్తులు ఖరారు అయ్యాయి. గ్రూప్ టూ నుంచి ఇండియా- ఇంగ్లాండ్ సెమీస్‌లో తలపడనున్నాయి.
గ్రూప్ వన్ నుంచి అప్గాన్‌తో దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ 1లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దక్షిణాఫ్రికా-అఫ్గానిస్తాన్ మధ్య మొదటి సెమీ ఫైనల్ జూన్ 26 బుధవారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం అయిదు గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. తరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇస్తూ అఫ్గాన్ సెమీస్ చేరింది. ఆఖరి సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పెను సంచలనం నమోదు చేసిన అఫ్గాన్ ఇక దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాటింగ్‌ను రషీద్ ఖాన్ కకావికలం చేశాడు. రషీద్ బౌలింగ్ కి దిగాక మ్యాచ్ స్వరూపం మార్చేశాడు. నాలుగు ఓవర్లలో 23పరుగులే ఇచ్చి 4వికెట్లు తీసిన రషీద్ బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నవీన్ ఉల్ హక్ కూడా 4వికెట్లు తీయటంతో బంగ్లా 105పరుగులకే ఆలౌట్ అయ్యింది.
రెండు గ్రూప్ ఇలా
జూన్ 27 గురువారం రాత్రి ఎనిమిది గంటలకు... గ్రూప్ టూలో రెండో సెమీఫైనల్‌లో టీమిండియా-ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఈ రెండో సెమీ-ఫైనల్ జరుగుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌కు ఒక్క రోజు గ్యాప్ ఉన్నందున రిజర్వ్ డే లేదు. అయితే ప్రతి సెమీ-ఫైనల్‌కు 250 నిమిషాల అదనపు సమయాన్ని అందుబాటులో ఉంచారు. ఒకవేళ వర్షం వస్తే ఈ సమయం ఇరు జట్లకు అందుబాటులో ఉంటుంది. మొదటి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే అందుబాటులో ఉండగా రెండో సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే అందుబాటులో లేదు. రెండు సెమీఫైనల్స్‌కు వర్షం కురిసే ప్రమాదం ఉండడంతో ఈ అదనపు సమయం... రిజర్వ్ డే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం పడి మ్యాచ్‌లు రద్దైతే సూపర్ ఎయిట్ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా-టీమిండియా ఫైనల్‌కు చేరతాయి. ఫైనల్‌కు వర్షం వస్తే ఫైనల్ చేరిన ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement