అన్వేషించండి

T20 World Cup 2024 Updates: టీ20 వరల్డ్ కప్‌ గ్రూప్ Dలో సంచలనాలకు ఛాన్స్! జాగ్రత్త పడకుంటే సౌతాఫ్రికా, శ్రీలంక ఇంటికే! 

Telugu News: టీ20 వరల్డ్ కప్‌ గ్రూప్‌డీలో సౌతాఫ్రికా పెద్దటీంగా కనిపిస్తున్నా దురదృష్టం వెంటాడుతుంది. సంచలనాలు సృష్టించే టాలెంట్‌ శ్రీలంక, బంగ్లాదేశ్‌కి కూడా ఉంది. అందుకే ఇది చాలా డేంజర్‌ గ్రూప్‌.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో ‘డి’ కాస్త డేంజరస్ గ్రూపర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌ల మధ్య టాప్-2 కోసం పోటీ జరిగేలా ఉన్నట్లు కనిపించినా... నెదర్లాండ్స్, నేపాల్ జట్లను పసి కూనలు అనుకోలేం. 2014 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు సైతం షాకిచ్చిన చరిత్ర నెదర్లాండ్స్‌కు ఉంది. ఈ గ్రూప్‌లో ఉన్న టీమ్స్ ఏంటి? వాటి బలాలేంటి?

1.దక్షిణాఫ్రికా (South Africa)
 ప్రపంచకప్‌‌ల్లో దక్షిణాఫ్రికా పేరు చెప్పగానే దురదృష్టమే గుర్తొస్తుంది. కచ్చితంగా గెలిచే పరిస్థితుల్లో కూడా బోల్తా పడ్డ సందర్భాలు లెక్కలేనన్ని. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. 2009 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌ చేరడమే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టు అత్యుత్తమ ప్రదర్శన. మార్‌క్రమ్‌(Aiden Markram) సారథ్యంలోని దక్షిణాఫ్రికా ప్రస్తుతం గ్రూప్‌-డిలో బలమైన జట్టు. చూడటానికి మాత్రం టీమ్ నిండా స్టార్లే కనిపిస్తున్నారు. బ్యాటింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ కంట్రోల్ చేయగల మిల్లర్(David Miller), క్లాసెన్‌‌(Heinrich Klaasen)లతో పాటు బంతితో చెలరేగే కగిసో రబడ(Kagiso Rabada), ఆన్రిచ్ నోకియా(Anrich Nortje) పెద్ద బలం. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్(Reeza Hendricks), మిడిలార్డర్‌ బ్యాటర్‌ స్టబ్స్‌(Tristan Stubbs) మంచి ఫాంలో ఉన్నారు. స్టబ్స్ హిట్టింగ్ ఏ లెవల్‌లో ఉందో ఇప్పటికే ఐపీఎల్‌లో చూశాం. ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాటర్లు మార్‌క్రమ్, డికాక్‌ ఫామ్‌(Quinton de Kock)లో లేకపోవడం ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు అతి పెద్ద సమస్య. దక్షిణాఫ్రికా గ్రూప్‌ దశ దాటినా సెమీస్‌ చేరడం మాత్రం అంత తేలిక కాదు. 

2. శ్రీలంక (Sri Lanka)
ప్రస్తుతం శ్రీలంక జట్టు స్ట్రగులింగ్ ఫేజ్‌లో ఉంది. జట్టు కూర్పుపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కెప్టెన్, ఆల్‌రౌండర్‌ హసరంగనే ఆ జట్టులో స్టార్ ప్లేయర్, కీలక ఆటగాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్న నిశాంక(Pathum Nissanka), కుశాల్‌ (Jayan Kaushal)రాణించడంపై శ్రీలంక సూపర్-8 ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఆరో టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు. పతిరాణా(Matheesha Pathirana), తుషార(Nuwan Thushara) ఐపీఎల్‌లో బాగా రాణించడం పేస్ బౌలింగ్ విషయంలో శ్రీలంకకు కలిసొచ్చే అంశం. మరోవైపు స్టార్ స్పిన్నర్‌ మహీష్ తీక్షణ ఫామ్‌లో లేడు. ఎటువంటి సంచలనాలు నమోదవకుండా ఉంటే శ్రీలంక జట్టుకు గ్రూప్‌ దశ దాటే సామర్థ్యం ఉంది.

3 బంగ్లాదేశ్(Bangladesh)
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో సాధించినా ఇంకా పసికూనగానే పరిగణించే జట్టు బంగ్లాదేశ్. తనదైన రోజున ఎంత బలమైన జట్టునైనా బంగ్లా మట్టికరిపిస్తుందని చరిత్ర చెబుతోంది. కానీ బంగ్లాదేశ్ ప్రస్తుతం అంత ఫాంలో లేదు. ఇటీవలే అమెరికాతో కూడా సిరీస్‌ కోల్పోయింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాణించిన స్టార్ పేసర్ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌(Mustafizur Rahman), ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌హసన్‌(Shakib Al Hasan) జట్టుకు పెద్ద బలం. మెహిదీ హసన్(Mahedi Hasan), రిషాద్‌ హసన్‌(Rishad Hossain) లాంటి ప్రతిభావంతులైన స్పిన్నర్లు కూడా జట్టు కూర్పులో కీలకం. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌(Tanzid Hasan), సౌమ్య సర్కార్(Soumya Sarkar), మహ్మదుల్లా(Mahmudullah), లిటన్‌దాస్‌(Liton Das) కీలకం. దక్షిణాఫ్రికా, శ్రీలంకల్లో ఒక జట్టును ఓడిస్తే బంగ్లాదేశ్ సూపర్-8కు చేరకునే అవకాశం ఉంది.

4. నెదర్లాండ్స్‌ (Netherlands)
 
నెదర్లాండ్స్‌ క్రికెట్ జట్టు ఇటీవల మెరుగైన ప్రదర్శన చేస్తోంది. గతంలో అనేకసార్లు టీ20 ప్రపంచకప్‌ ఆడిన అనుభవం ఈ జట్టుకుంది. నెదర్లాండ్స్ జట్టులో బాస్‌ డిలీడ్, వాన్‌బీక్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు కూడా షాకిచ్చిన చరిత్ర నెదర్లాండ్స్‌కు ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న గ్రూపుల పరంగా చూస్తే నెదర్లాండ్స్ సూపర్-8కు చేరాలంటే ఒక్క సంచలనం సరిపోదు. 

5.నేపాల్ (Nepal)

టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు ప్రస్తుతం నేపాల్ జట్టు మీదనే ఉంది. 2022 ఏషియన్ గేమ్స్‌లో మంగోలియాపై నేపాల్ ఒక టీ20 మ్యాచ్‌లో 314 పరుగులు చేసింది. దీన్ని బట్టి చూస్తే నేపాల్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget