News
News
X

IND Vs SA 2022: భారత్‌పై గెలవాలంటే అతన్ని పక్కన పెట్టాల్సిందే - దక్షిణాఫ్రికాకు మాజీ క్రికెటర్ సూచన!

భారత్‌పై విజయం సాధించాలంటే దక్షిణాఫ్రికా తుదిజట్టులో షంసికి బదులు పేసర్ ఉండాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అభిప్రాయపడ్డారు.

FOLLOW US: 
 
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమ ప్లేయింగ్ XIలో అదనపు పేసర్‌కు చోటు కల్పించేందుకు స్పిన్నర్ తబ్రయిజ్ షంసిని దక్షిణాఫ్రికా పక్కన పెట్టాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అభిప్రాయపడ్డారు. పాయింట్ల పట్టికలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కంటే ముందుకు వెళ్లడంతో పాటు సెమీస్ బెర్త్ కోసం ప్రోటీస్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్‌తో తలపడుతుంది.

దక్షిణాఫ్రికా ఇప్పటివరకు రెండు గేమ్‌లు ఆడారు, ఒకటి గెలుపొందగా, మరొకటి వర్షం కారణంగా రద్దయింది. పెర్త్‌లోని ట్రాక్ అదనపు పేస్, బౌన్స్‌ను అందిస్తుంది. కాబట్టి దక్షిణాఫ్రికా అదనపు పేసర్‌తో భారత బ్యాటర్‌లను ఇబ్బంది పెట్టగలదని మూడీ సూచించాడు.

"మేం పెర్త్ (ఆప్టస్) స్టేడియంలో పేస్, బౌన్స్ చూశాము. వారి పేస్ అటాక్‌తో దక్షిణాఫ్రికా చాలా మెరుగైన జట్టుగా నిలవనుంది. షంసి నిజానికి అద్భుతమైన బౌలర్. అందులో వంక పెట్టడానికి ఏమీ లేదు. కానీ జట్టు బ్యాలెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే అతను అడ్డంకి కావచ్చు. టీమిండియా అదనపు పేసర్‌తో వెళ్లాలి.” అని టామ్ మూడీ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఫాస్ట్ బౌలింగ్‌ను తమ జట్టు విస్మరించలేదని అన్నారు. "మా జట్టులో ఉన్న బ్యాటర్లను పేస్ అంతగా బాధపెడుతుందని నేను అనుకోను." అని రాథోర్ విలేకరుల సమావేశంలో అన్నారు.

News Reels

ఇప్పటి వరకు రెండు అర్ధ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లి భారత బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను పాకిస్తాన్‌పై అజేయంగా 82 పరుగులు చేశాడు. అలాగే నెదర్లాండ్స్‌పై 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నెదర్లాండ్‌పై రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా అర్ధశతకాలు సాధించి కొంత ఆత్మవిశ్వాసాన్ని అందించారు. కేవలం కేఎల్ రాహుల్ ఫామ్ మాత్రమే టీమిండియాకు ఆందోళన కలిగించే అంశం.

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

Published at : 29 Oct 2022 11:40 PM (IST) Tags: Team India T20 World Cup 2022 Tom Moody IND Vs SA South Africa

సంబంధిత కథనాలు

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!

ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Umran Malik: 151 కి.మీ వేగం - శాంటోను బౌల్డ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ వీడియో వైరల్

Umran Malik: 151 కి.మీ వేగం - శాంటోను బౌల్డ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ - ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ -  ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?