T20 WC: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్- 50 రెట్లు అధిక ధరలకు అమ్మకాలు
టీ20 వరల్డ్‌కప్ 2022లో భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో తలపడనున్నాయి.
IND vs PAK 2022: ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2022 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 16న జరుగుతుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియా మీడియా అందిస్తున్న వివరాల ప్రకారం చాలా మంది అభిమానులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్లాక్ మార్కెట్ దందా బాగా పెరిగిపోయిందని మీడియా ఆరోపిస్తోంది. టికెట్లు 50 రెట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని కథనాలు ప్రచురిస్తోంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని పేర్కొది.
సోషల్ మీడియా ద్వారా టికెట్ల బ్లాక్ మార్కెటింగ్
ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రజలు సోషల్ మీడియా ద్వారా టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనున్నాయి. అధికారికంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జరిగినప్పుడు ఐదు నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోయాయి.
'అధికారికంగా అలాంటి ఫిర్యాదులేవీ అందలేదు'
టీ20 ప్రపంచ కప్ 2022 మీడియా మేనేజర్ మాక్స్ అబాట్ మాట్లాడుతూ.. బ్లాక్ దందాపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెబుతున్నారు. అలాంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం టికెట్లకు చాలా డిమాండ్ ఉందని ఆయన అంగీకరించారు. ఏదో ఒక విధంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేరుగా చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. అందుకే వాళ్లంతా వేర్వేరు దారుల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్‌లో ఎంత ఇచ్చైనా కొనేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే బ్లాక్ దందా నడిపేవాళ్లు టికెట్ రేట్లను 50 రెట్లు పెంచి అమ్ముతున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.