By: ABP Desam | Updated at : 12 Aug 2023 09:38 AM (IST)
Edited By: Pavan
నెం.4 లో సూర్యకుమార్ యాదవ్ కుదురుకున్నట్లేనా? రోహిత్ ఏమన్నాడంటే? ( Image Source : twitter/surya_14kumar )
Suryakumar Yadav: రెండు వరుస ఓటముల తర్వాత, మంగళవారం జరిగిన మూడో టీ 20లో వెస్టిండీస్ పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది టీమ్ ఇండియా. వరుస పరాభవాల తర్వాత ఓ విజయం ఉపశమనం కల్గించినట్లయింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-2 తో టీమిండియా వెనకంజలోనే ఉంది. మూడో టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. గత కొంతకాలంగా పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్నందున సూర్య నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ను చూడటం భారత శిబిరానికి గొప్ప ఊరట కల్పించింది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 188.63 స్ట్రైక్ రేట్ తో 44 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ODI సిరీస్ లో సూర్య తన మార్కును చూపించడంలో విఫలమయ్యాడు. పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో సూర్య చేసిన పరుగులు కేవలం 78. టీ20 ల్లో దుమ్ములేపే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ టీ20 వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్.. వన్డే ఫార్మాట్ లో మాత్రం నిలదొక్కుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లో మూడు మ్యాచుల్లోనూ గోల్డె్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్.
శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో సూర్యకుమార్ యాదవ్ కి వరుస అవకాశాలు ఇస్తోంది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. రోహిత్ శర్మ సూర్య పర్ఫార్మెన్స్ పై స్పందిస్తూ.. తనకు మద్దతుగా నిలిచాడు. వన్డేల్లో తన ఫామ్ ను కనుక్కోవడానికి సూర్యకు అవకాశాలు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నాడు.
చాలా వన్డే మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లలాగనే నూర్య వైఖరి, మనస్తత్వం ఉంటున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. సూర్య నిజంగానే కష్టపడుతున్నాడని, అతనిలాంటి బ్యాటర్ కు ఆత్మవిశ్వాసం ఇవ్వడానికి మరిన్ని మ్యాచుల్లో సూర్యకు అవకాశాలు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ప్రదర్శనతో పోల్చాడు. మొదటి 4-5 మ్యాచుల్లో సూర్య ఎక్కువ పరుగులు చేయలేదని.. ఆ తర్వాత తాను గాడిలో పడ్డాడని, అతని నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వచ్చిందో తెలిసిందే కదా అని రోహిత్ శర్మ గుర్తు చేశాడు.
తన లాంటి ఆటగాడి కోసం, అలాంటి పరిస్థితి, వాతావరణాన్ని సృష్టించడమే తమ పనిగా చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. రెండు, మూడు మ్యాచుల్లో బాగా రాణించకపోయినంత మాత్రానా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదన్నాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత అలాంటి బ్యాటర్ ఉంటే గెలవగలమన్న నమ్మకం ఉంటుందన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో సూర్య కుమార్ యాదవ్ చేసిందే అదేనని, టాప్ లో ఉన్న బ్యాటర్లు ఔట్ అయ్యి, సూర్య నుంచి అలాంటి బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు.
శనివారం లాడర్ హిల్‌లో 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం భారత్ కు కీలకం కానుంది. 5 మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 2-1 తో ఆధిక్యంలో ఉన్న వెస్టిండీస్.. ఈ మ్యాచ లో గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. భారత్ ఇందులో గెలిస్తే.. ఆగస్టు 13న జరగనున్న ఐదో మ్యాచ్ కీలకం కానుంది.
IND vs AUS, 2nd ODI: 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు - ఆసీస్‌కు టీమ్‌ఇండియా టార్గెట్ 400
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
IND vs AUS 2nd ODI: ఆసీస్‌దే రెండో వన్డే టాస్ - టీమ్‌ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
IND vs AUS 2nd ODI: రెండో వన్డేకు బుమ్రా దూరం! బీసీసీఐ 'ఎమర్జెన్సీ' ట్వీట్!
Asian Games: బంగ్లా 51కే ఆలౌట్ - ఆసియా టీ20 ఫైనల్‌కు స్మృతి మంధాన సేన
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
/body>