By: ABP Desam | Updated at : 16 Jan 2023 05:07 PM (IST)
Edited By: nagavarapu
విరాట్ కోహ్లీ (source: twitter)
Gavaskar On Kohli: ఈ ఏడాది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఆడిన 4 వన్డేల్లో 3 శతకాలు సాధించాడు. దాదాపు నాలుగేళ్ల పేలవ ఫాం తర్వాత గతేడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై టీ20 టన్నుతో తన సెంచరీల కరవును తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కేవలం 22 ఇన్నింగ్సుల్లో 4 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అందులో 3 వన్డే శతకాలు ఉన్నాయి. అవి కేవలం 4 ఇన్నింగ్సుల్లో చేశాడు.
ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్ మూడో వన్డేలో కోహ్లీ అద్భుత శతకం అందుకున్నాడు. ఇది అతనికి 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలోనే స్వదేశంలో సచిన్ టెండూల్కర్ సాధించిన 49 శతకాలకు విరాట్ కోహ్లీ చేరువగా వచ్చాడు. ఇంకో 3 శతకాలు బాదితే మాస్టర్ బ్లాస్టర్ రికార్డును విరాట్ సమం చేస్తాడు. అయితే అది ఎప్పుడు అందుకుంటాడనే చర్చ మొదలైంది. ఎందుకంటే గత నాలుగేళ్లలో ఒక్క సెంచరీ చేయని కోహ్లీ... ఇప్పుడు 3 శతకాలను తక్కువ ఇన్నింగ్సుల్లోనే అందుకున్నాడు. అందుకే ఇప్పుడు సచిన్ రికార్డును కోహ్లీ ఎప్పుడు అందుకుంటాడనే చర్చ నడుస్తోంది. దీనిపై టీమిండియా లెజెండ్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్ మొదలవడానికి ముందే కోహ్లీ వన్డేల్లో సచిన్ 49 సెంచరీల రికార్డును అందుకుంటాడని గావస్కర్ జోస్యం చెప్పారు.
ఐపీఎల్ కన్నా ముందే
ఐపీఎల్ కు ముందు భారత్ మొత్తం 6 వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ తో 3, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 3 ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫాంను బట్టి చూస్తే ఈ 6 ఇన్నింగ్సుల్లో మరో 3 శతకాలు బాదడం కష్టమేమీ కాదని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫాం, అతను ఆడుతున్న విధానాన్ని బట్టి 3 సెంచరీలు కష్టమేం కాదు. ఐపీఎల్ కు ముందు టీమిండియాకు 6 వన్డేలు ఉన్నాయి. సచిన్ రికార్డును చేరుకోవాలంటే కోహ్లీకి 3 శతకాలు కావాలి. ప్రస్తుతం అతను బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆ 3 సెంచరీలు చేస్తాడని నాకనిపిస్తోంది అని గావస్కర్ అన్నాడు.
జనవరి 18 నుంచి భారత్ లో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో రెండు జట్లు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నాయి.
Triumphant series win. 🇮🇳🏆 pic.twitter.com/M0znse1IDe
— Virat Kohli (@imVkohli) January 15, 2023
"Mahi Shot" 🥹❤️
— DHONI Empire™ (@TheDhoniEmpire) January 16, 2023
The Golden bond of @msdhoni and @imVkohli 🫂#ViratKohli #MSDhoni pic.twitter.com/lsKyhfUyrC
Ball by ball highlights of Virat Kohli's 166*(110) vs SL
— ViswanthDHFM (@RainaFanatic3) January 16, 2023
74th Int Ton || 46th ODI Ton
Part:1#ViratKohli𓃵 pic.twitter.com/OelEqpSYog
WPL 2024 auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు
BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్ కొత్త చరిత్ర
IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?
Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్-10
IND vs AUS T20I: భారత్‌దే అత్యధిక విజయాల రికార్డు - పాకిస్థాన్ రికార్డు బద్దలు
Telangana Election Results 2023 LIVE: కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>