అన్వేషించండి
Advertisement
WPL 2024 Title: అంబరాన్నంటిన సంబరాలు -హోరెత్తుతున్న సోషల్ మీడియా
Superwomen: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు సాధింలేని ఘన రికార్డును తన పేరిట లిఖించుకుంది.
Social Media In Frenzy As RCB Clinch WPL 2024 Title: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు సాధింలేని ఘన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో బెంగళూర ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని... బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 113 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి బెంగళూరు ఛేదించింది. ఈ గెలుపుతో కప్పు కోసం 17 ఏళ్ల ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. తమ అభిమాన జట్టు కప్పు గెలవడం పట్ల ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. బెంగళూరులోని వీధుల్లో యువత విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు.
అభిమానుల సంబరాలు
ఈ సాలా కప్ మనదే అని ప్రతి ఏటా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈసాలా కప్ దక్కడంతో ఎక్కడా ఆగడం లేదు. కోట్లాది మంది అభిమానుల కల నెరవేరడంతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. కంగ్రాచ్యులేషన్ ఆర్సీబీ.. ఈసాలా కప్ మనదే.. ఈసాలా కప్ నమదే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఎట్టకేలకు సాధించామని ఒకరు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు.
తొలిసారి ఫైనల్ చేరి...
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో బెంగళూరు( Royal Challengers Bangalore) అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో తక్కువ పరుగులను కాపాడుకుని బలమైన ముంబైని బెంగళూరు మట్టికరిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఎలీస్ పెర్రీ అర్ధ శతకంతో తొలుత 135 పరుగులు చేసిన బెంగళూరు... ముంబైను 130 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ముంబై బౌలర్ల ధాటికి బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబై 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సోఫీ డివైన్ 10, కెప్టెన్ స్మృతి మంధాన 10, దిశా 0 పరుగులకే పెవిలియన్ చేరారు. కానీ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఫెర్రీ మరోసారి బెంగళూరును ఆదుకుంది. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడిన పెర్రీ.. స్కోరింగ్ రేట్ మరీ పడిపోకుండా చూసింది. పెర్రీ 40 బంతుల్లో అర్ధసెంచరీ అందుకుంది. ఆఖరి ఓవర్లో ఆమె ఔటైనా.. చివరి బంతికి సిక్స్ బాదిన జార్జియా స్కోరు 130 దాటించింది. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్, నాట్ సీవర్, సైకా ఇషాక్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబైను 130 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా చిత్తు చేసి కప్పును ఒడిసిపట్టింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion