Shreyas Iyer Injury: భారత్ కు ఎదురుదెబ్బ, స్టార్ బ్యాటర్ శ్రేయర్ అయ్యర్‌కు గాయం - వన్డే సిరీస్‌కు డౌటే!
టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు ఏమైంది. అతడు బ్యాటింగ్ కు ఎందుకు రావడం లేదని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాలేదు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా అభిమానులకు వచ్చిన డౌట్ ఏంటంటే.. టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు ఏమైంది. అతడు బ్యాటింగ్ కు ఎందుకు రావడం లేదని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ తెలిపింది. నాలుగో రోజు మ్యాచ్ లో భాగంగా అయ్యర్ బ్యాటింగ్ కు దిగాల్సి ఉంది. కానీ వెన్నునొప్పి కారణంగా బ్యాటింగ్ పొజిషన్ లో తరువాత రావాలని భావించాడు. కానీ అందుకు ఛాన్స్ లేదని, ఈ టెస్టుతో పాటు త్వరలో ఆసీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కు సైతం అయ్యర్ దూరం కానున్నాడని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ, బీసీసీఐ సంయుక్తంగా బ్యాటర్ అయ్యర్ పరిస్థితిపై పునరాలోచిస్తున్నారు. మరోవైపు మార్చి 17 నుంచి ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా తాజా టెస్ట్ తో పాటు వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం కానున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వెన్నులో నొప్పి అని బీసీసీఐకి తెలిపాడు. దాంతో మేనేజ్ మెంట్ అతడ్ని స్కానింగ్ కోసం పంపింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అయ్యర్ హెల్త్ కండీషన్ ను పర్యవేక్షింస్తోందని బీసీసీఐ మెడికల్ అప్ డేట్ ఇచ్చింది. ఈ కారణంగానే అయ్యర్ నేడు బ్యాటింగ్ కు రాలేదు. మరోవైపు కోహ్లీ భారీ శతకం, అక్షర్ పటేల్ (79) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా, చివర్లో జట్టు తప్పిదాలు కొంపముంచాయి.
ముర్ఫీ బౌలింగ్ లో కోహ్లీ (364 బంతుల్లో 186, 15 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్ లబుషేన్ అందుకోవడంతో భారత ఇన్నింగ్స్ 571 పరుగుల వద్ద ముగిసింది. గాయం కారణంగా అయ్యర్ బ్యాటింగ్ కు రాలేదని తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది కీలకమైన వన్డే వరల్డ్ కప్ ఉంది. దీని కోసం అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు కెప్టెన్ కూడా అయ్యర్. త్వరలోనే కోలుకుని అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశాలపై ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ మాత్రం అయ్యర్ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటోంది.
A stupendous innings by @imVkohli comes to an end.
— BCCI (@BCCI) March 12, 2023
He departs for 186 runs.#INDvAUS #TeamIndia pic.twitter.com/ag8qqjYNq5
16 పరుగుల తేడాలో 4 వికెట్లు
ప్రత్యర్థి ఆసీస్ పై కనీసం 200 పరుగుల ఆధిక్యం వస్తుందనేలా కనిపించిన భారత్ చివర్లో తడబాటుకు లోనైంది. 555 కు 5 వికెట్లుగా ఉన్న భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్(79) ను స్టార్క్ బౌల్డ్ చేయగా, వెంట వెంటనే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అశ్విన్ (7), ఉమేష్ డకౌట్ అయ్యారు. చివరి వికెట్ గా మాజీ కెప్టెన్ కోహ్లీ వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ 571కు పరిమితమైంది. కేవలం 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మరో రోజు మాత్రమే ఆట ఉండటంతో చివరి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ టెస్ట్ గెలిచి ఉంటే భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేరుగా చేరే ఛాన్స్ ఉండేది.