అన్వేషించండి

Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు

వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్ పునరాగమనం, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు తీవ్రంగా చర్చిస్తుండగా అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై ఉత్కంఠ నెల‌కొంది.

Selection Committee Evaluates Squad Options For West Indies Series:  స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్లను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం ఢిల్లీలో స‌మావేశ‌మ‌వ‌నుంది. విండీస్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ఆసియా క్రీడల జట్టునే దాదాపు ఎంపిక చేసే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 27 నుంచి తిరువనంతపురంలో ఆరంభమయ్యే  వన్డేల‌కు జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారిన‌ట్లు తెలుస్తోంది. జట్టు ఎంపిక కోసం ఢిల్లీకి చేరుకోనున్న చీఫ్ సెలెక్టర్ అగార్కర్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు తన పదవీకాల పొడిగింపుపై బోర్డు పెద్దలతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు 

హార్దిక్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా..?
పూర్తి ఫిట్‌నెస్ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వన్డే జట్టులోకి నేరుగా తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీవ్ర క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. అక్టోబర్ 6 నుంచి పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా-ఏతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాండ్యా ఇప్పటికే ఇండియా-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతడు వెంటనే 10 ఓవర్ల బౌలింగ్, 50 ఓవర్ల ఫీల్డింగ్ భారాన్ని మోయగలడా అనే విషయాన్ని సెలెక్షన్ ప్యానెల్ ఆలోచిస్తోంది. మరో పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆసియా క్రీడల కోసం జపాన్ వెళ్లనుండగా, సూర్యాంశ్ షెడ్గే, వెంకటేష్ అయ్యర్‌లు గాయాల బారిన పడ్డారు. దీంతో పాండ్యా అందుబాటులో లేకపోతే జట్టుకు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత తీవ్రంగా వేధించనుందని తెలుస్తోంది.

Read Also: BCCI Selector Drama:  తేలిపోనున్న అగార్కర్ భవితవ్యం.. బోర్డుతో విభేదాల వేళ పొడిగింపుపై ఉత్కంఠ

వ‌న్డేల్లో పంత్ కు మ‌రో అవ‌కాశం..
ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కారణంగా టెస్ట్ వైస్ కెప్టెన్సీతో పాటు వైట్‌బాల్ జట్లలో స్థానం కోల్పోయిన రిషబ్ పంత్‌కు ఈసారి జట్టులో చోటు దక్కే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్ ఆసియా క్రీడల డ్యూటీలో ఉండటంతో కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రాహుల్ డిప్యూటీగా ఉంటాడు. ఒకవేళ పంత్‌ను తప్పిస్తే ధ్రువ్ జురెల్‌ను బ్యాకప్ కీపర్‌గా తీసుకుని, పంత్‌ను ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా సారథిగా పంపే యోచనలో సెలెక్టర్లు ఉన్నారు.

 మిడిలార్డ‌ర్లో గైక్వాడ్..
శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తర్వాత రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం క‌నిపిస్తోంది. యశస్వి జైస్వాల్ రిజర్వ్ ఓపెనర్‌గా, రజత్ పాటిదార్ మిడిల్ ఆర్డర్ బ్యాకప్‌గా ఉండనున్నారు. మరోవైపు రవీంద్ర జడేజా వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. రెస్ట్ తర్వాత మహమ్మద్ సిరాజ్ పేస్ దళంలో చేరనున్నాడు. అతడితో పాటు గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్‌లు పేస్ విభాగాన్ని ముందుకు సాగించ‌నున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
KL Rahul Century:  సచిన్, ద్రవిడ్ సరసన చేరిన రాహుల్, శతకం చేజార్చుకున్న గిల్, తొలి టెస్టుపై టీమిండియా ప‌ట్టు
సచిన్, ద్రవిడ్ సరసన చేరిన KL రాహుల్, శతకం చేజార్చుకున్న గిల్, తొలి టెస్టుపై టీమిండియా ప‌ట్టు
KL Rahul Milestone: సచిన్, కోహ్లీ సరసన చేరేందుకు అడుగు దూరంలో రాహుల్.. సేనా దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు
సచిన్, కోహ్లీ సరసన చేరేందుకు అడుగు దూరంలో రాహుల్.. సేనా దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget