అన్వేషించండి

BCCI Selector Drama:  తేలిపోనున్న అగార్కర్ భవితవ్యం.. బోర్డుతో విభేదాల వేళ పొడిగింపుపై ఉత్కంఠ,

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై త్వరలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుండగా, విండీస్ వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

BCCI In Talks Over Extending Ajit Agarkar Contract: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కొనసాగింపుపై రాబోయే 48 గంటల్లో స్పష్టత రానుంది. 2023 జూలై 4న చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో టీమ్ ఇండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం, రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలకడం కూడా ఇతడి హయాంలోనే జరిగాయి. నిజానికి అగార్కర్ కాంట్రాక్ట్ 2026 జూన్‌తోనే ముగియాల్సి ఉన్నప్పటికీ, బీసీసీఐ అతడికి మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. అక్టోబర్ 4తో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో, మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగించే అంశంపై వచ్చే రెండు రోజుల్లో బీసీసీఐ కీలక భేటీ నిర్వహించనుంది.

Read Also: Asia Cup 2026 Trophy Row Erupts: ఛాంపియన్‌గా నిలిచినా వేదికపైకి రాని భారత్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ నిరాకరణ, ఆసియా కప్‌లో మరోసారి వివాదం

బోర్డుతో కోల్డ్ వార్.. కీలక రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ డుమ్మా
గత రెండు నెలలుగా బీసీసీఐ పెద్దలు, సెలెక్షన్ కమిటీ మధ్య అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 3న జరిగిన బోర్డు పెర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే కాంట్రాక్ట్ పొడిగింపుపై ఇరు వర్గాలు సానుకూలంగానే ఉన్నాయని, మిగిలి ఉన్న కొన్ని చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయని సమాచారం. ప్రస్తుతం అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెస్టిండీస్ సిరీస్ కోసం నిర్వహించే సెలెక్షన్ మీటింగే అతడికి చివరిది అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం.

Read Also: Asia Cup Winner Team India: తిరుగులేని టీమిండియా.. లంక‌ను చిత్తు చేసి, ఎనిమిదోసారి ఆసియాక‌ప్ కైవ‌సం.. స‌త్తా చాటిన షెఫాలీ, స్మృతి, శ్రీచ‌ర‌ణి, దీప్తి 

వెస్టిండీస్ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్.. రాహుల్‌కు కీలక బాధ్యత
సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు తొలి వన్డేను తిరువనంతపురంలో ఆడనుంది. తర్వాతి రెండు మ్యాచ్‌లు గువహాటి (సెప్టెంబర్ 30), ముల్లన్‌పూర్ (అక్టోబర్ 3) వేదికలుగా జరుగుతాయి. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 ముగిసిన మరుసటి రోజైన సెప్టెంబర్ 16న ఈ సిరీస్‌తో పాటు ఇరానీ కప్ కోసం భారత జట్లను ప్రకటించనున్నారు.

సెలెక్షన్ భేటీపై దృష్టి.. తుది నిర్ణయానికి రంగం సిద్ధం
ఈ నెల 16న జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరుకానున్నాడు. విండీస్ సిరీస్ జట్టును ఎంపిక చేయడంతో పాటు, అతడి కాంట్రాక్ట్ భవితవ్యంపై బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయంపై క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒకవేళ అగార్కర్ కు ఉద్వాసన పలికితే, తర్వాత ఎవరు అతని పగ్గాలు చేపట్టనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arshdeep World Record: భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Dhoni Secret Superpower: గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget