అన్వేషించండి

Asia Cup 2026 Trophy Row Erupts: ఛాంపియన్‌గా నిలిచినా వేదికపైకి రాని భారత్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ నిరాకరణ, ఆసియా కప్‌లో మరోసారి వివాదం

శ్రీలంకను 72 పరుగులతో చిత్తు చేసి 8వ ఆసియా కప్ గెలిచిన భారత్, ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది.

Indian Women Clinch Historic Eighth Title Amid High Drama: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వరుసగా రెండో ఏడాది ఆసియా కప్ ఫైనల్ ట్రోఫీ వివాదం చెల‌రేగింది. గతంలో భారత పురుషుల జట్టు విషయంలో జరిగిన హైడ్రామా ఈసారి మహిళల ఫైనల్ అనంతరం రిపీట్ అయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు శ్రీలంకను 72 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను ద‌క్కించుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించడంతో సరికొత్త వివాదం చెలరేగింది. రాత్రి 11:20 గంటలకు మ్యాచ్ పూర్తి కాగా, అర్ధరాత్రి 12:05 గంటల వరకు ప్రజెంటేషన్ వేడుక స్టార్ట్ కాలేదు.

Read Also: Aussie Star Cameron Green Wedding: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన‌ గ్రీన్.. ప్రేయసి ఎమిలీ రెడ్‌వుడ్‌తో ఏడడుగులు

త్వ‌ర‌గా ముగిసిన వేడుక‌లు..
శ్రీలంక మాజీ ఆటగాడు ఫర్వీజ్ మహరూఫ్ ప్రజెంటేషన్ వేడుకను ప్రారంభించి రన్నరప్ శ్రీలంకను వేదికపైకి ఆహ్వానించాడు. ఆ జట్టు నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ చెక్కును, శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ ఎరాన్ విక్రమరత్నే చేతుల మీదుగా పతకాలను అందుకుంది. ఆ తర్వాత ఛాంపియన్ ఇండియాను వేదికపైకి ఆహ్వానిస్తారని అందరూ భావించిన తరుణంలో మహరూఫ్ అకస్మాత్తుగా వేడుక ముగిసినట్లు అనౌన్స్ చేశాడు. మరోవైపు భారత క్రీడాకారిణులు మైదానంలో జట్టుగా చేరగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియాలు ఉత్తమ ఫీల్డర్ నందిని శర్మకు పతకం అందజేసి జట్టును అభినందించారు. అనంతరం భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయింది. లంక కెప్టెన్ చమరి ఆట‌ప‌ట్టుకు అవార్డు ఇచ్చిన వెంటనే నఖ్వీ మైదానం నుంచి నిష్క్ర‌మించాడు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోకపోవడం బీసీసీఐ తీసుకున్న అధికారిక నిర్ణయమని టీమ్ ఇండియా హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ తెలిపాడు.

Read Also: Asia Cup Winner Team India: తిరుగులేని టీమిండియా.. లంక‌ను చిత్తు చేసి, ఎనిమిదోసారి ఆసియాక‌ప్ కైవ‌సం.. స‌త్తా చాటిన షెఫాలీ, స్మృతి, శ్రీచ‌ర‌ణి, దీప్తి

సేమ్ సీన్ రిపీట్.. పురుషుల జ‌ట్టు మాదిరిగానే..
2025 సెప్టెంబర్ 28న ఇదే మైదానంలో పాకిస్తాన్‌ను ఓడించి పురుషుల జట్టు ఆసియా కప్ గెలిచినప్పుడు కూడా నఖ్వీ వేదికపై ఉండటంతో గంద‌ర‌గోళం చెల‌రేగింది. ఆ సమయంలో నఖ్వీ ట్రోఫీని తీసుకెళ్లిపోవాలని ఆదేశించడంతో సూర్యకుమార్ యాదవ్ బృందం ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది. ఇప్పటికీ ఆ ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలోనే ఉంచారు. ఇప్పుడు మహిళల జట్టు విషయంలోనూ అదే తరహా పరిస్థితి పునరావృతమైంది.

ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్..
అంతకుముందు బ్యాటింగ్‌లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 68, స్మృతి మంధాన 59 పరుగులతో విరుచుకుపడి 12.5 ఓవర్లలోనే 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల ఆసియా కప్ చరిత్రలోనే షఫాలీ 24 బంతుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు నమోదు చేసింది. భారత్ 20 ఓవర్లలో 183/5 పరుగులు సాధించింది. ఛేదనలో లంక కెప్టెన్ చమరి ఆట‌ప‌ట్టు 36 రన్స్ చేసినా, దీప్తి శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో శ్రీలంక 111 పరుగులకే పరిమితమై భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో గ‌త ఎడిష‌న్ ఫైన‌ల్లో లంక చేతిలో ఎదురైన ఓట‌మికి టీమిండియా ఘ‌నంగా బ‌దులు తీర్చుకున్న‌ట్లు అయింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
Rinku Singh Captaincy:  KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget