అన్వేషించండి

ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు

మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోబోమని ముందే చెప్పామని, త్వరలోనే పురుషుల మహిళల ఆసియా కప్‌లు రెండూ భారత్‌కు వస్తాయని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.

BCCI Reveals Reason Behind Skipping Presentation Ceremony: మహిళల ఆసియా కప్ 2026 విజేతగా నిలిచినప్పటికీ ట్రోఫీ ప్రదానోత్సవానికి దూరంగా ఉండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తి వివరాలను వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పును బహూకరిస్తే భారత మహిళల జట్టు ఆ వేడుకకు హాజరుకాదని తాము ముందే స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు. తాజాగా దీనిపై మాట్లాడిన సైకియా, "మేము ఏసీసీతో సంప్రదింపులు జరిపాం. పురుషుల క్రికెట్ జట్టు విషయంలో జరిగిన పద్ధతిలోనే ట్రోఫీ ప్రదానం కొనసాగితే మేము హాజరుకాబోమని ఏసీసీ చైర్మన్‌కు నేను వ్యక్తిగతంగా ముందే సమాచారం ఇచ్చాను. వారు తమ మొండి వైఖరిని మార్చుకోకపోవడంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది. ఈ వేడుకకు దూరంగా ఉండటం ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు మేం ఘనమైన నివాళి అర్పించాం" అని వివరించారు.

Read Also: Samson Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టడం వ్యూహాత్మక తప్పిదమా..? సంజూ శాంసన్ ఫెయిల్యూర్‌తో మొదలైన రగడ!! 

సాంప్రదాయాలు పాటించని నఖ్వీ.. ప్రత్యామ్నాయ ప్రతిపాదన తిరస్కరణ
గతంలో ఉన్న సంప్రదాయాలను మొహ్సిన్ నఖ్వీ కాలరాస్తున్నాడని సైకియా ఆరోపించారు. "ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గతంలో ఏసీసీలో ఉన్నప్పుడు, విజేతగా నిలిచిన జట్టుకు చెందిన ఆఫీస్ బేరర్ ట్రోఫీని అందజేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ గతేడాది నుంచి ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. మేము ఏసీసీకి ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించాం. ఏసీసీ ప్రెసిడెంట్ లేదా డిప్యూటీ చైర్మన్ ఖలీద్ సాహెబ్‌తోనైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరాం. ఒకవేళ ఖలీద్ సాహెబ్ ట్రోఫీని ఇచ్చి ఉంటే మా జట్టు కచ్చితంగా వేదికపైకి వచ్చేది. పహల్గామ్ ఘటన తర్వాత ఏ దేశంతో అయితే మనకు స్నేహపూర్వక సంబంధాలు లేవో, ఆ దేశ అంతర్గత మంత్రిగా ఉన్న వ్యక్తి చేతుల నుంచి ట్రోఫీని అందుకోకూడదనేది మా దృఢమైన వైఖరి. మా ప్రతిపాదనను వారు అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు.

Read Also: Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు

త్వరలోనే ఇండియాకు రెండు ట్రోఫీలు.. అభిమానులకు భరోసా
ట్రోఫీ వివాదంపై భారత అభిమానులకు సైకియా పూర్తి భరోసా ఇచ్చారు. దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయిన పురుషుల ఆసియా కప్, ఇప్పుడు మహిళల ఆసియా కప్ రెండూ అతి త్వరలోనే మన దేశానికి చేరుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళల జట్టు 2025లో తొలిసారి 50 ఓవర్ల వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో బలమైన జట్టును నిర్మిస్తున్నామని, రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రీడలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యం.. బోర్డు బలమైన సంకల్పం
రాబోయే ఆసియా క్రీడలు 2026లో పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలను గెలవడమే లక్ష్యంగా తాము వ్యూహాలను రచిస్తున్నామని, అంతర్జాతీయ వేదికలపై భారత జట్లు అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తాయని బోర్డు వ‌ర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget