అన్వేషించండి

Sarfaraz khan: బిహేవియర్‌, ఫిట్‌నెస్‌ మార్చుకో! లేదంటే.. సర్ఫరాజ్‌కు అల్టిమేటం?

Sarfaraz khan: యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని, బరువు తగ్గాలని సూచించారు.

Sarfaraz khan: 

యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని, బరువు తగ్గాలని సూచించారు. మైదానం బయట, లోపలా ప్రవర్తన తీరు మార్చుకోవాలని అంటున్నారు. కేవలం బ్యాటింగ్ ఫిట్‌నెస్‌ ఉంటే సరిపోదని వెల్లడించారు. వెస్టిండీస్‌ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చారు.

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీసుకు శివసుందర్‌ దాస్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. చెతేశ్వర్‌ పుజారాపై వేటు వేసింది. దేశవాళీ క్రికెటర్లు పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను (Sarfaraz Khan) ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం విమర్శలకు దారితీసింది. అతడిని ఎంపిక చేయనప్పుడు రంజీ ట్రోఫీలకు ఉన్న విలువేంటో వివరించాలని గావస్కర్‌ అన్నాడు. మూడు సీజన్లుగా అతడు టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడని గుర్తు చేశాడు. సర్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత ఫస్ట్‌క్లాస్‌లో 79.65 సగటు ఉన్నది అతడికి మాత్రమేనని సూచించాడు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టెస్టుల్లో కూడా ఎంపికవ్వొచ్చేమోనని ఎద్దేవా చేశాడు.

'సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆక్రోశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు! అయితే అతడిని మళ్లీ మళ్లీ పట్టించుకోకపోవడానికి క్రికెట్‌ ఏతర కారణాలు ఉన్నాయని చెప్పగలను. వేర్వేరు కారణాలతో అతడిని పక్కన పెడుతున్నారు. వరుస సీజన్లలో 900 పైచిలుకు పరుగులు చేస్తున్న క్రికెటర్‌ను పట్టించుకోవడం లేదంటే సెలక్టర్లు పిచ్చోళ్లేం కాదు. అందుకు ఒక కారణం అతడి ఫిట్‌నెస్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు లేదు. బరువు తగ్గించుకొని మరింత ఫిట్‌గా మారాలి. కేవలం బ్యాటింగ్‌ ఫిట్‌నెస్‌ ఉంటేనే ఎంపిక చేయరు' అని ఆ అధికారి అన్నారు.

క్రికెటర్లను ఎంపిక చేయకపోవడానికి ఐపీఎల్‌ వైఫల్యాలూ కారణమేనన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. అది మీడియా కల్పించిన దృక్పథమని పేర్కొన్నారు. 'అలాంటి దృక్ఫథాన్ని మీడియా నిర్మించింది. మరే ఇతర కారణాలు ఉండవని మీరు అనుకుంటున్నారా? మయాంక్‌ అగర్వాల్‌ టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టినప్పుడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో ఒక నెల్లోనే 1000 పరుగులు చేశాడు. అప్పుడు ఎమ్మెస్కే కమిటీ ఐపీఎల్‌ ప్రదర్శన చూసిందా? హనుమ విహారీ విషయంలోనూ ఇంతే. దేశవాళీ, భారత్‌-ఏ తరపున ఆడిన విధానాన్ని బట్టే ఎంపికయ్యాడు. వాళ్ల ఐపీఎల్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోనప్పుడు ఎస్‌ఎస్‌ దాస్‌ కమిటీ అలా చేస్తుందా? సింపుల్‌.. క్రికెట్‌ రీజనేమీ లేదు' అని ఆయన ముగించారు.

'ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో బాగా ఆడితే చాలు టెస్టు క్రికెట్లోనూ ఎంపిక చేస్తారు. పరిస్థితి అలాగే ఉంది. ఒకసారి టెస్టు జట్టును చూడండి. రెండు టెస్టులకు నలుగురు ఓపెనర్లను తీసుకున్నారు. ఆరుగురు ఓపెనర్లు ఉండటానికి ఇదేమీ ఒకప్పటి వెస్టిండీస్‌ పేస్‌ అటాకింగ్‌ కాదు. మూడు సీజన్లుగా సర్ఫరాజ్‌ 100 సగటుతో స్కోర్లు చేస్తున్నాడు. టెస్టుల్లో ఎంపిక అవ్వడానికి అతడింకా ఏం చేయాలి? తుది 11 మందిలో లేకున్నా కనీసం జట్టులోకైనా తీసుకోవాల్సింది. కనీసం అతడి ప్రదర్శనలను గుర్తిస్తున్నామని చెప్పండి. లేదంటే రంజీలు ఆడటం మానేయమని చెప్పండి. వాటితో పన్లేదు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టెస్టుల్లోకి తీసుకుంటామని చెప్పండి' అని గావస్కర్‌ ఘాటుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Pawan Apologizes : తిరుమల ఘటనపై దేశానికి  క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
తిరుమల ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
Embed widget