అన్వేషించండి
Advertisement
Sania Mirza: సానియా మీర్జా వేదాంతం- మరోసారి హాట్ టాపిక్‌గా క్రికెటర్‌తో విడాకులు?
Sania Mirza Divorce Rumours: ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా మీర్జా చేసిన ఓ పోస్ట్ ఈ స్టార్ కపుల్ విడాకుల వార్తను మరోసారి తెరపైకి తెచ్చింది.
Sania Mirza Divorce News: భారత టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకుల వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా మీర్జా చేసిన ఓ పోస్ట్ ఈ స్టార్ కపుల్ విడాకుల వార్తను మరోసారి తెరపైకి తెచ్చింది. విడాకులు, కష్టం గురించిన ఓ కోట్‌ను షేర్ చేసింది. ఈ షేర్‌తో సానియా- షోయబ్ మాలిక్ దంపతులు విడిపోయారనే పుకార్లు మళ్లీ షికార్లు చేస్తున్నాయి.
సానియా ఇన్ స్టా స్టోరీలో ఏముందంటే..?
" వివాహం కష్టం. విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి" అంటూ
సానియా షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీతో మళ్లీ విడాకుల గురించ చర్చ మొదలైంది. " పెళ్లి కష్టం.. విడాకులు తీసుకోవడం కష్టం... జీవితంలో ప్రతీది కష్టమైనదే. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మీరు చేసుకునే ఎంపికను బట్టి జీవితం ఉంటుందంటూ సానియా ఆ పోస్ట్‌లో షేర్ చేసింది. సానియా షేర్ చేసిన ఈ స్టోరీ క్షణాల్లో వైరల్‌గా మారింది. భర్త షోయబ్ మాలిక్‌తో సానియా విడిపోతోందని... అందుకే ఇలా పోస్ట్ చేసిందన్న ఊహాగానాలు చెలరేగాయి. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో షోయబ్ మాలిక్ సైతం ట్విటర్ అకౌంట్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా నేమ్‌ను తీసేశాడు. తాజాగా సానియా తన ఇన్‌స్టా నుంచి షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో సానియా- షోయబ్ త్వరలోనే డివోర్స్ తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గతంలోనూ...
సానియా మీర్జా -షోయబ్ మాలిక్ సంసార జీవితం గురించి అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. భర్త షోయబ్ మాలిక్‌తో సానియా విడిపోయిందని.. వీరి మధ్య అంత సఖ్యత లేదనే పుకార్లు సోషల్ మీడియాలో చాలాకాలంగా వైరల్ అవుతున్నాయి. సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే ఈ పుకార్లపై వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడింది లేదు. సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించింది. అటు షోయబ్ మాలిక్ సైతం ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమంటూ నెటిజన్లు అప్పట్లో వార్తలు చెలరేగాయి. ఈ జంట ఒకరి గురించి ఒకరు పోస్ట్ చేసి చాలా కాలం అయ్యింది. దాంతో ఈ జంట విడాకుల ఊహాగానాలను మరింత పెంచినట్టైంది. ఎప్పటిలాగే తమ విడాకుల పుకార్లపై ఈ జంట మౌనం వహిస్తారో లేదా..బయటకు వచ్చి విడాకుల వార్తలను ఖండిస్తారో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion