అన్వేషించండి

Sachin Deepfake Video: సచిన్‌ డీప్‌ ఫేక్‌పై స్పందించిన కేంద్రమంత్రి

Sachin Deepfake Video: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ డీప్‌ఫేక్‌ పై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పందించారు.

కృత్రిమ మేధ సాంకేతికతతో రూపొందించే డీప్‌ఫేక్‌ వీడియో(Deepfake Video)లను కట్టడి చేసేందుకు త్వరలోనే పటిష్ఠమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకొస్తామని  కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ (Union minister Rajeev Chandrasekhar)తెలిపారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar) డీప్‌ఫేక్‌ వీడియో బారిన పడటంపై  స్పందించిన మంత్రి.. ఏఐ, డీప్‌ఫేక్‌ సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి ప్రమాదకరమనీ.. యూజర్లకు హాని చేయడంతోపాటు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. కాగా.. గతేడాది నవంబరులో డీప్‌ఫేక్‌లపై సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?
క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో బారిన పడడం సంచలనం రేపుతోంది. స్వయంగా సచినే ఆ వీడియాలు ఉంది తాను కానని చెప్పాల్సి వచ్చింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్ వైరల‌్ కావడంతో అది చివరికి సచిన్‌కు చేరింది.  స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ గాడ్‌ స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
ఆందోళన కలిగిస్తోందన్న సచిన్‌
ఈ వీడియోలు నకిలీవని సచిన్ స్పష్టం చేశాడు. సాంకేతికతను ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నాడు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని అభిమానులకు సూచించాడు. సోషల్‌ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ.. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సచిన్‌ అన్నాడు. డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని సచిన్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్‌ విభాగ అకౌంట్లకు ట్యాగ్‌ చేశాడు. ఇటీవల సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు. టీమ్‌ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, కొంతమంది తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, వాటిని నమ్మొద్దని తెలిపారు.
 
సారా పేరున నకిలీ అకౌంట్‌
కొంత‌కాలంగా సారా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మ‌న్ గిల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలు వ‌స్తున్నాయి. అవి నిజమేనన్నట్లుగా గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సారా కేరింతలు కొడుతూ అతడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో సారా పేరిట ఉన్న ఖాతాల్లో గిల్ పై ప్రేమ ఉన్నట్లు ప‌లు ఫోటోలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. దీనిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన సారా టెండూల్కర్‌ తొలిసారి స్పందించింది. తన పేరిట జరుగుతున్న దుష్ప్రచారంపై సారా ఆవేదన వ్యక్తం చేసింది. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget