By: ABP Desam | Updated at : 29 Mar 2023 10:36 AM (IST)
SA vs WI 3rd T20I ( Image Source : Twitter )
SA vs WI 3rd T20I: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ సంచలనం సృష్టించింది. ప్రపంచ అగ్రశ్రేణి ఆల్ రౌండర్లు, భీకర బ్యాటర్లు, మ్యాచ్‌ను ఏ క్షణంలో అయినా మలుపు తిప్పే హిట్టర్లు, సూపర్ ఫాస్ట్ బౌలర్లు ఉన్న జట్టును ఓడించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ‘నువ్వెంత కొడితే నేను అంతకు రెట్టింపు కొడతా’ అన్నట్టుగా సాగిన ఈ సమరంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లు హోరాహోరిగా పోరాడినా సిరీస్ విజయం మాత్రం కరేబియన్ కుర్రాళ్లదే. రెండో మ్యాచ్ లో విండీస్ నిర్దేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలుండగానే ఊదేసిన సఫారీల దూకుడు మూడో టీ20లో పనిచేయలేదు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి పోరులో గెలిచి మలి పోరులో ఓడిన వెస్టిండీస్.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో మాత్రం కలిసికట్టుగా ఆడి సఫారీలను ఓడించింది.
ఈసారీ భారీ స్కోర్లే..
జోహన్నస్‌బర్గ్ వేదికగా మంగళవారం జరిగిన సౌతాఫ్రికా - వెస్టిండీస్‌ల మధ్య మూడో మ్యాచ్ లో కరేబియన్ టీమ్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (25 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 41, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియా షెఫర్డ్ (22 బంతుల్లో 44 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరబాదుడు బాదారు.
వీళ్లూ బాదారు...
భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా వెనక్కి తగ్గలేదు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోయాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (21) నాలుగు ఫోర్లు కొట్టినా త్వరగానే ఔటయ్యాడు. కానీ వన్‌డౌన్ లో వచ్చిన రిలీ రూసో (21 బంతుల్లో 42, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి హెండ్రిక్స్ రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 80 పరుగులు జోడించారు.
బ్రేక్ ఇచ్చిన హోల్డర్, కాపాడిన జోసెఫ్..
ధాటిగా ఆడుతూ సఫారీ టీమ్ ను విజయం దిశగా తీసుకెళ్తున్న ఈ జోడీని జేసన్ హోల్డర్ విడదీశాడు. అతడు వేసిన 11వ ఓవర్లో ఐదో బంతికి రూసో.. చార్లెస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (11) ను జోసెఫ్ ఔట్ చేశాడు. హెండ్రిక్స్‌తో కలిసి కెప్టెన్ ఎయిడిన్ మార్క్‌రమ్ (18 బంతుల్లో 35 నాటౌట్, 4 ఫోర్లు) సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. కానీ జోసెఫ్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి హెండ్రిక్స్.. రొవ్మన్ పావెల్ చేతికి చిక్కాడు. ఆ అతడు.. హెండ్రిక్స్ తో పాటు హెన్రిచ్ క్లాసెన్ (6), పార్నెల్ (2) వికెట్లు కూడా తీశాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు కావాల్సి ఉండగా మార్క్‌రమ్ మూడు ఫోర్లు కొట్టినా విజయం ముందు ఏడు పరుగుల దూరంలో (213-6) సౌతాఫ్రికా ఆగిపోయింది.
ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసిన జోసెఫ్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. జాన్సన్ ఛార్లెస్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ విజయంతో విండీస్ జట్టు సిరీస్ ను 2-1 తేడాతో నెగ్గింది. టెస్టు సిరీస్ ను 2-0 తో తేడాతో దక్షిణాఫ్రికా గెలుచుకోగా వన్డే సిరీస్ 1-1 తో సమమైంది.
ఎదురులేని భారత్, మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
IND vs AUS 1st ODI: డేవిడ్ భాయ్ హాఫ్ సెంచరీ - చుక్కలు చూపిస్తున్న షమి
IND vs AUS 1st ODI: తొలి వన్డే టాస్ మనదే! రాహుల్ ఏం ఎంచుకున్నాడంటే!
Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
Shiva Rajkumar : హాలీవుడ్ స్టైల్‌లో శివ రాజ్ కుమార్ 'ఘోస్ట్' ఫస్ట్ సాంగ్ - గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ విడుదల
Shoulder: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది
/body>