అన్వేషించండి

Rohit Sharma: ఆ రికార్డులను మడతపెట్టి! రోహిత్‌ రికార్డులే రికార్డులు

Rohit Sharma: టీ 20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు మిగిలిన ఏకైక టీ 20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ విశ్వరూపం చూపాడు. ఏ రికార్డు అయినా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు(Bangalore) వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌(Afghanistan)ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరిన రోహిత్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. తాను క్రీజులో కుదురుకుంటే  ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌నో విమర్శలకులందరికీ చెప్పేశాడు. అఫ్గాన్‌పై విధ్వంసకర సెంచరీతో విమర్శలకు బ్యాట్‌తో సరైన సమాధానం చెప్పాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు మిగిలిన ఏకైక టీ 20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ విశ్వరూపం చూపాడు. ఏ రికార్డు అయినా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు. ఈ  ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్‌ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
 
అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్‌కు ఇది ఐదో శతకం. పొట్టి ఫార్మాట్‌లో ఇన్ని శతకాలు చేసిన తొలి బ్యాటర్‌ హిట్‌మ్యానే. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు నాలుగు శతకాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బాబర్‌ ఆజమ్‌ మూడు సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు.
 
సిక్సర్ల రికార్డు..
తన సూపర్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 8 సిక్సర్లు బాదాడు. తద్వారా టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా ఇంగ్లండ్‌ మాజీ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ రికార్డును హిట్‌మ్యాన్‌ బ్రేక్‌ చేశాడు. మోర్గాన్‌.. 86 సిక్సర్లు కొట్టగా.. రోహిత్‌ ఖాతాలో 90 సిక్సర్లున్నాయి. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో కూడా రోహిత్‌దే అగ్రస్థానం. 151 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. ఇప్పటివరకూ 190 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో మార్టిన్‌ గప్తిల్‌ 173, ఆరోన్‌ ఫించ్‌ 125, క్రిస్‌ గేల్‌ 125 సిక్సులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 
విరాట్‌ను అధిగమించి
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 1643 పరుగులతో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. 1570 పరుగులతో విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు హిట్‌ మ్యాన్‌ బద్దలు కొట్టాడు.
 
నాలుగో అత్యధిక స్కోరు..
ఈ మ్యాచ్‌లో రోహిత్‌.. 121 పరుగులు చేసి  అజేయంగా నిలిచాడు. టీ 20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నాలుగో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్‌  126 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉండగా.. రుతురాజ్‌ (123), విరాట్‌ కోహ్లీ (122) లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ నలుగురు కడదాక బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గానే నిలిచారు. 
 
14 నెలల తర్వాత ఈ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్‌.. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్లు అయి నిరాశపరిచినా భారత్‌కు అత్యవసరమైన పరిస్థితుల్లో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget